కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూల్ నుండి తొలి మహిళ మంత్రి అఖిల ప్రియరికార్డు: పుట్టినరోజునే ఇలా...

కర్నూల్ జిల్లా నుండి తొలిసారిగా భూమా అఖిల ప్రియ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకోనున్నారు.మహిళ మంత్రిగా ఆమె కర్నూల్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించనున్నారు. తొలిసారిగా క్యాబినెట్లోకి చేరి చరిత్

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: కర్నూల్ జిల్లా నుండి తొలిసారిగా భూమా అఖిల ప్రియ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకోనున్నారు.మహిళ మంత్రిగా ఆమె కర్నూల్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించనున్నారు. తొలిసారిగా క్యాబినెట్లోకి చేరి చరిత్ర సృష్టించారు అఖిలప్రియ.

భూమా అఖిలప్రియ చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మంత్రిగా ఆదివారం నాడు ప్రమాణం చేశారు. కర్నూల్ జిల్లా నుండి మంత్రివర్గంలో చేరిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.ఈ జిల్లా నుండి చాలామంది మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టినా, మంత్రులుగా బాధ్యతలు నిర్వహించలేదు.

కర్నూల్ జిల్లా నుండి కోట్ల సుజాతమ్మ,పాటిల్ నీరజారెడ్డి, గౌరు చరిత, శోభా నాగిరెడ్డిలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు.కాని, వారు మాత్రం మంత్రులుగా పనిచేయలేదు.

bhuma akhila priya

శోభ నాగిరెడ్డి మరణం తర్వాత రాజకీయాల్లోకి అనివార్యంగా వచ్చింది.భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తర్వాత అఖిలప్రియను మంత్రివర్గంలోకి తీసుకొన్నారు చంద్రబాబునాయుడు.

పుట్టినరోజునే మంత్రిగా ప్రమాణం
భూమా అఖిలప్రియ పుట్టినరోజు ఆదివారం. అదే రోజున ఆమె మంత్రిగా ప్రమాణం చేశారు.ఆమె పుట్టినరోజు కావడంతో ఆళ్ళగడ్డ, నంద్యాలలో భారీగా ఏర్పాట్లు చేశారు అభిమానులు. మంత్రిగా ప్రమాణం చేయగానే అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేయనున్నారు.భూమా అభిమానులంతా అఖిలప్రియ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను అమరావతికి వెళ్ళారు.

English summary
first lady minister bhuma akhila priya from kurnool district akhila priya got ministry chadrababu naidu's cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X