అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ షాక్‌తో 5గురి మృతి, బాబు దిగ్భ్రాంతి, అబిడ్స్ లాడ్జిలో తనిఖీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని విడపనకల్ మండలం తీగలగుర్తిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. పొలంలో హైటెన్షన్ విద్యుత్తు తీగలు తెగిపడటంతో ఐదుగురు అక్కడికి అక్కడే మృతి చెందారని తెలుస్తోంది.

హైటెన్షన్ విద్యుత్తు తీగలు కావడంతో వారి శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని చెబుతున్నారు. పొలంలో బోరుకు మరమ్మతులు చేస్తుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మడతులు ఎర్రస్వామి, రేవన్న, బ్రహ్మయ్య, వీరేంద్ర, రాజశేఖర్‌లుగా సమాచారం.

చంద్రబాబు దిగ్భ్రాంతి

Five dead in Anantapur with current shock

అనంతపురం జిల్లాలో హైటెన్షన్ వైరు తెగిపడి ఐదుగురు మృతి చెందిన సంఘటన పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ సంఘటన తెలియగానే, ఆరా తీశారు. విచారణకు ఆదేశించారు.

కల్తీ డీజిల్‌ తయారీ ముఠా అరెస్ట్‌

తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ డిజీల్‌ తయారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కడియం మండలం దుళ్లలో కిరోసిన్‌తో కల్తీ డిజిల్‌ తయారు చేస్తున్న ముఠాను రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారాలకు సంబంధించి కిరోసిన్‌ డీలర్‌ తమ్మన హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. రెండు ట్యాంకర్ల కల్తీ డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాలకొల్లు, రాజమండ్రి, భీమవరం పెట్రోల్‌బంక్‌లకు కల్తీ డీజిల్‌ సరఫరా అవుతున్న విజిలెన్స్‌ అధికారులు నిర్ధారించారు.

ఆబిడ్స్‌లోని ఓ లాడ్జిలో పోలీసుల తనిఖీలు

హైదరాబాదులోని ఆబిడ్స్‌లో ఓ లాడ్జిలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తుల నుంచి 7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ ముంబైకి చెందిన నగల వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు. బంగారానికి సంబంధించి వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు.

English summary
Five dead in Anantapur district with current shock.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X