అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ నుంచి చంద్రబాబును కాపాడుతున్న మాజీ కాంగ్రెస్ నేతలు!

మొన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, నిన్న మరో మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: మొన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, నిన్న మరో మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల వర్షం నీళ్లు వైసిపి అధినేత జగన్ చాంబర్లోకి రావడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాతే, ఉండవల్లి అసెంబ్లీ నిర్మాణాన్ని మెచ్చుకోవడం వైసిపికి షాక్ అని చెప్పవచ్చు.

Former Congress MPs saves Chandrababu from YS Jagan?

చంద్రబాబుకు మాజీ కాంగ్రెస్ నేతల ఊరట

గతంలో లగడపాటి రాజగోపాల్ నూతన సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఇది చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన నూతన భవనాలు బాగున్నాయని మెచ్చుకున్నారు. చంద్రబాబును లగడపాటి కలవడం వెనుక వివిధ రకాల ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే.

రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నూతన అసెంబ్లీ బాగుందని కితాబిచ్చారు. అంతేకాదు, నీళ్లు వచ్చినంత మాత్రాన వివాదం చేయాల్సిన అవసరం లేదని వైసిపి నేతలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఉండవల్లి అసెంబ్లీలోని జగన్ చాంబర్‌ను కూడా పరిశీలించారు.

అమరావతిలోని నిర్మాణాలపై ఓ వైపు వైసిపి విమర్శలు చేస్తుంటే మాజీ కాంగ్రెస్ నేతలు లగడపాటి, ఉండవల్లిలు మెచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతానికి వీరు ఏ పార్టీలో చేరే ఉద్దేశ్యంలోను లేరు.

ఇదే ఉండవల్లి టిడిపిపై విమర్శలు చేస్తున్నప్పుడు జగన్ పార్టీలో చేరడానికి మాట్లాడుతున్నట్లుగా ఉందని టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. ఆయన వైసిపిలో చేరుతారని కూడా జోస్యం చెప్పారు.

English summary
Former Congress MPs Lagadapati Rajagopal and Undavalli Arun Kumar saving CM Chandrababu Naidu from YSRCP chief YS Jagan?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X