అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శివరామకృష్ణన్ మృతి, అప్పుడే నిజమైన నివాళి:జగన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: మాజీ ఐఏఎస్‌ అధికారి శివరామకృష్ణన్‌ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. 1992లో ఐఏఎస్‌ అధికారిగా పదవీ విరమణ పొందారు. కోల్‌కతా మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీకి సెక్రటరీ, ఛీప్ ఎగ్జిక్యూటివ్‌గా సేవలందించారు.

పదవీ విరమణ అనంతరం వరల్డ్‌ బ్యాంక్‌ అడ్వజర్‌గానూ పనిచేశారు. అర్ధశాస్త్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న శివరామకృష్ణన్ అర్బన్ మేనేజ్మెంట్‌పై పలు పుస్తకాలు కూడా రాశారు. తెలంగాణ విభజనకు ముందు ఏపీ రాజధాని ఎంపిక కోసం సరైన ప్రదేశాన్ని సూచించడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్నంలో ఒక కమిటీని నియమించింది.

Former IAS officer Sivaramakrishnan died

అనంతరం ఏపీ రాజధానిపై శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ ఆగస్టు 27, 2014న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు 187 పేజీల నివేదికను సమర్పించింది.

శివరామకృష్ణన్ మృతికి వైయస్ జగన్ సంతాపం

శివరామకృష్ణన్ మృతికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఏపీ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. శివరామకృష్ణన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

English summary
Former IAS officer Sivaramakrishnan died due to ill-health today. It may be recalled that the senior IAS officer Sivaramakrishnan headed the committee appointed by the Central government to select a suitable place for the AP State Capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X