వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తూర్పు గోదావరి జిల్లా పీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మహిళా నేత పాముల రాజేశ్వరీ దేవి చేరారు. శనివారం తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె, లోటస్ పాండ్‌లోని పార

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తూర్పు గోదావరి జిల్లా పీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మహిళా నేత పాముల రాజేశ్వరీ దేవి చేరారు. శనివారం తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె, లోటస్ పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి, ఆ పార్టీ జెండాను భుజాన వేసుకున్నారు.

జగన్ స్వయంగా ఆమెను పార్టీలోకి స్వాగతం పలికారు. రాజేశ్వరీ దేవి చేరికతో తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ మరింతగా బలపడుతుందని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. కాగా, రాజేశ్వరీ దేవి పీ గన్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Former MLA Pamula Rajeswari Devi Joins YSRCP

వైసీపీ సోషల్ మీడియా విభాగానికి నోటీసులు

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సామాజిక మాధ్యమ విభాగానికి తుళ్లూరు పోలీసులు నోటీసులు జారీచేశారు. ఏప్రిల్ 25న విచారణకు హాజరు కావాలంటూ సోషల్‌ మీడియా విభాగాధిపతి మధుసూదన్‌రెడ్దికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియా అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ రవికిరణ్‌ అనే వ్యక్తిని రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

సోషల్‌మీడియాలో పొలిటికల్‌ పంచ్‌ పేరుతో రవికిరణ్‌ పోస్టులు పెడుతున్నాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం విడిచిపెట్టారు. అయితే రవికిరణ్‌కు వైసీపీతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సోషల్‌ మీడియా విభాగానికి నోటీసులు జారీ చేశారు.

English summary
In a boost to the YSRCP, two-time MLA and prominent leader from East Godavari district Pamula Rajeswari has joined the party on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X