అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతికి రూ.250 కోట్ల భూమి ఇచ్చాడు, 2017 కల్లా బాబు ప్లాన్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవసరాల కోసం ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ్ మల్లెల అనంత పద్మనాభ రావు కుటుంబ సభ్యులు తమకు వారసత్వంగా వచ్చిన భూమిలో 50 ఎకరాల సాగుభూమిని ప్రభుత్వానికి అప్పగించారు.

సబ్ కలెక్టర్ డాక్టర్సృదనతో మాజీ సర్పంచ్ అనంత పద్మనాభ రావు కుమారుడు మల్లెల శ్రీనివాస చౌదరి చర్చలు జరిపిన అనంతరం నవ్యాంధ్ర రాజధానికి భూమి ఇవ్వాలని నిర్ణయించారు. వీరు 2013లోను ఇబ్రహీంపట్న ప్రాంత ప్రజల కోసం 35 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు.

మంగళవారం ఆ భూమిని ఆనుకొని ఉన్న 40 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో పది ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. సబ్ కలెక్టర్‌కు ఇందుకు సంబంధించిన పత్రాలను అంద చేశారు. వీటి మార్కెట్ విలువ రూ.250 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

అమరావతి

అమరావతి

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్‌లు ఇలా ఉండనున్నాయి. ఇది ఏరియల్ మాస్టర్ ప్లాన్.

అమరావతి

అమరావతి

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టెంబుల్ ఆఫ్ జస్టిస్ సిటీ వ్యూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఫస్జ్ ఫేజ్‌ను 2017 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెడ్ లైన్ విధించారు.

అమరావతి

అమరావతి

నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. తమిళనాడు రాజధాని చెన్నై కంటే ఆరు రెట్లు పెద్దగా, స్వతంత్ర భారత దేశంలో ప్రణాళికా బద్ధంగా నిర్మిస్తున్న ఐదో రాజధాని.

చంద్రబాబు

చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో కొత్త సచివాలయం ఇలా ఉండనుంది. దీనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

English summary
Former sarpanch gives 50 acres to Andhra Pradesh new capital Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X