విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా జీవితం మీ చేతుల్లోనే వేరేవాళ్ళ చేతుల్లో పెట్టకండి: జలీల్ ఖాన్

తన జీవితాన్నే మీరే నిర్ణయించండి అంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. వేరేవాళ్ళ చేతుల్లో పెట్టకండి అంటూ ఆయన చంద్రబాబుతో సరదాగా వ్యాఖ్యలు చేయడంతో అందరూ నవ్వారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తన జీవితాన్నే మీరే నిర్ణయించండి అంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. వేరేవాళ్ళ చేతుల్లో పెట్టకండి అంటూ ఆయన చంద్రబాబుతో సరదాగా వ్యాఖ్యలు చేయడంతో అందరూ నవ్వారు. ఈ ఘటన విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందు సందర్భంగా మంగళవారం నాడు చోటుచేసుకొంది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

చంద్రబాబును ముస్లిం మతపెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. విందులో స్థానిక ముస్లిం నేతలతో మమేకమయ్యారు. పవిత్ర మజ్రీబ్ నమాజ్ లో పాల్గొన్నారు చంద్రబాబు.

ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబునాయుడు ముందుగా మజ్రీబ్ నమాజ్ ను ఆచరించారు. అనంతరం కార్పోరేషన్ ఆధ్వర్యంలో నూతనం నిర్మించిన బస్టాపులను ప్రారంభించారు బాబు.

జలీల్ ఖాన్ మరోసారి నవ్వులు పూయించారు

జలీల్ ఖాన్ మరోసారి నవ్వులు పూయించారు

తన జీవితాన్ని మీరే నిర్ణయించండి, వేరే వాళ్ళ చేతుల్లో తన జీవితాన్ని పెట్టకండంటూ అంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా చంద్రబాబుతో సరదాగా చేసిన వ్యాఖ్యలు విందులో నవ్వులు పూయించాయి. జలీల్ ఖాన్ మంత్రిపదవిని ఆశిస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో జలీల్ ఖాన్ మంత్రివర్గంలో చోటుదక్కలేదు. అయితే ఈ నేపథ్యంలో బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా మంత్రివర్గాన్ని ఉద్దేశించి చేసినవేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ముస్లింలకు అండగా

ముస్లింలకు అండగా

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లింలంతా టిడిపివైపే ఉన్నారన్నారు. ఇక్కడి ముస్లింల అభివృద్దికి కృషి చేయాలని జలీల్ ఖాన్ సీఎంకు విన్నవించారు. అయితే ఈ విషయమై బాబు సానుకూలంగా స్పందించారు. విజయవాడ, కడపలో హజ్ భవనాలను నంద్యాలలో మినీ హజ్ హౌజ్ ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ముస్లిం సోదరులకు రూ.515 విలువ చేసే రంజాన్ తోఫాను ముస్లింలకు అందిస్తున్నామన్నారు బాబు.

మసీదులు, దర్గాల మరమత్తు కోసం కోటిరూపాయాలు

మసీదులు, దర్గాల మరమత్తు కోసం కోటిరూపాయాలు

మసీదులు, దర్గాల మరమత్తుల కోసం రూ. కోటి మంజూరు చేశామని చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.ముస్లిం సోదరులకు రూ. 515 విలువ చేసే రంజాన్ తోఫాను ముస్లింలకు అందిస్తున్నట్టు చెప్పారు. రంజాన్ ను ముస్లింలు పవిత్ర మాసంగా భావిస్తారని బాబు గుర్తుచేశారు.

క్యాన్సర్ మహిళలకు ఆర్థిక సహయం

క్యాన్సర్ మహిళలకు ఆర్థిక సహయం

నియోజకవర్గానికి చెందిన క్యాన్సర్ తో బాధపడుతున్న రజియా సుల్తానా అనే ముస్లిం మహిళను ఎమ్మెల్యే వేదికపైకి ఆహ్వనించాు. ఆమె ఆరోగ్య ఇబ్బందులను, కుటుంబ నేపథ్యాన్ని సభాముఖంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విషయమై స్పందించిన చంద్రబాబునాయుడు సిఎం రిలీప్ ఫండ్ కింద ఆమెకు రూ. 5 లక్షల ఆర్ధిక సహయాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

English summary
Funny conversation between Ap chiefminister Chandrababu naidu Vijayawada west MLA Jaleelkhan in Iftar party on Tuesday at Vijayawadaya.Jaleelkhan explained issues to Chandrababunaidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X