వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిలో కెసిఆర్ అంతటి అందగాడు లేడా, సాక్షి పత్రికది తప్పు: గాలి

తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గోదావరిపై ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించి దిగవనున్న ఆంధ్రప్రదేశ్‌.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ఎంపి కవిత అనడం అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఏపీ ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నట్టు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ చెబుతున్నారని ఆయన గుర్తు చేస్తూ కేసీఆర్ అంతటి అందగాడు మా ఏపీలో లేరా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తెలంగాణ పట్ల స్నేహపూర్వకంగా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిలో ఉందని ముద్దుకృష్ణమ విమర్శించారు.

దెబ్బకు దెబ్బ పేరుతో సాక్షి దినపత్రిక తప్పుడు వార్త ప్రచురించిందని, పురుషోత్తంపట్నం పోలవరానికి లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్‌ ఆమోదయోగ్యమని కేంద్రమే చెప్పిందని అన్నారు. అపెక్స్, సీడబ్ల్యూసి అనుమతి లేకుండా కాళేశ్వరానికి టెండర్లు పిలిచారని మరోసారి ప్రశ్నించారు. మహారాష్ట్రతో కలిసి తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించాలని యోచిస్తోందని, ఇలా చేస్తే ఏపీ నష్టపోతుందని గాలి ముద్దుకృష్ణమ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గోదావరిపై ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించి దిగవనున్న ఆంధ్రప్రదేశ్‌కు నీరు రాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించే హక్కు టీఆర్ఎస్‌కు లేదని గాలి అన్నారు. కేవలం శాసనసభ నుంచి వాకౌట్‌ చేసినందుకు టీడీపీ శాసనసభ్యులను సస్పెండ్‌ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో వాకౌట్‌ చేసే అధికారం ఎవరికైనా ఉంటుందన్నారు. టీడీపీ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు.

Gali Muddu Krishnama Naidu fires at TRS Government

బీజేపీపై నారాయణ ఫైర్

ఉత్తరప్రదేశ్‌లో విజయం తర్వాత కేంద్ర ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. యూపీలో ప్రజలను ఏమార్చి విజయం సాధించారని గుంటూరులో ఆరోపించారు.

బీజేపీ వ్యవహారశైలి ఆందోళన కలిగిస్తోందని.. దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ప్రతిపక్షాలను చూసి భయపడుతున్నాయని.. అప్రజాస్వామ పద్ధతిలో ఎమ్మెల్యేలను సభకు రానీయకుండా చేస్తున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై నిషేధం కొనసాగించడం సరికాదన్నారు.

English summary
Telugudesam MLC Gali Muddu Krishnama Naidu on Friday fired at TRS Government for water issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X