విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మన ముందు పాక్ ఎంత?: మంత్రి గంటా సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పాకిస్థాన్‌పై సంచనల వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను అంతమొందించడం మన దేశానికి పెద్ద విషయం కాదని ఆయన తేల్చేశారు. మన బలంతో పోల్చితే అన్ని విషయాల్లోనూ పాకిస్థాన్‌ తీసికట్టేనని అన్నారు.

మన దేశం సంయమనం పాటిస్తుంటే.. పాక్ మాత్రం ఎప్పటికప్పుడు దారుణాలకు ఒడిగడుతోందని మండిపడ్డారు. వే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బీచ్‌ రోడ్‌ని వైఎంసీఏ వద్ద ఆదివారం ఉదయం అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు.

Ganta on Pakistan

ఈ సందర్భంగా వీర జవాన్ల ఫోటోలతో కూడిన బ్యానర్‌పై సంతకాల సేకరణ చేశారు. దీనిని భారత సైన్యానికి పంపనున్నారు. ఈ బ్యానర్‌పై మంత్రి గంటా తొలి సంతకం చేశారు. అనంతరం అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కొద్దిసేపు మౌనం పాటించారు.

వే ఫౌండేషన్‌ అధ్యక్షులు గంటా స్వామి, ఏయూ పూర్వ వీసీ జిఎస్‌ఎన్‌ రాజు, విజయనగరం పోలీసు శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ రాజ శిఖామణి, సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ, వీజేఎఫ్‌ అధ్యక్షులు .శ్రీనుబాబు, వినయోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ ప్రతినిధి డి రవికుమార్‌, భారీ ఎత్తున యువతీయువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, ఇటీవల పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్‌లోని యూరీలో చేసిన దాడిలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సైన్యం కాల్పుల్లు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

English summary
Andhra Pradesh minister Ganta Srinivasa Rao on Sunday fired at Ganta on Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X