వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణను తొలగించాలి: ఎన్జీటీకి ఏపీ, ‘సర్వీస్ రూల్స్ జీవో విడుదల’

పోలవరంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో బుధవారం విచారణ జరిగింది. వాదోపవాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 11కు వాయిదా వేసింది. విచారణ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తప్పించాలని ఆంధ్రప్రదేశ్ ట్ర

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/అమరావతి: పోలవరంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో బుధవారం విచారణ జరిగింది. వాదోపవాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 11కు వాయిదా వేసింది. విచారణ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తప్పించాలని ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్‌‌ను కోరింది.

పోలవరం పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యేంతవరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ నిలిపివేయాలని ఏపీ కోరింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతివాదిగా తొలగించే విషయంపై..వారంలోగా అభ్యంతరాలను దాఖలు చేయాలని రేలా స్వచ్ఛంద సంస్థను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోరుతూ... తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది.

Ganta releases service rules GO

ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది: మంత్రి గంటా

ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం దొరికిందని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ జీవోలను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం దొరికిందని అన్నారు.

సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషి వల్లే ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధ్యమైందని గంటా అన్నారు. ప్రధానోపాధ్యాయులకు జేఏఎల్‌గా ప్రమోషన్లు ఇస్తామని, ఉపాధ్యాయులకు ఎంఈఓలు, డైట్ లెక్చరర్లు, జేఎల్‌గా ప్రమోషన్లు ఇస్తామని మంత్రి గంటా తెలిపారు.

English summary
Andhra Pradesh minister Ganta Srinivasa Rao on Wednesday released service rules GO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X