వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ వ్యాఖ్యలను స్వాగతించిన గంటా: ‘ఎ-అమరావతి, బి-బాబు’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పలువురు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు అవగాహన రాహిత్యం ఇష్టమొచ్చినట్ల మాట్లాడారని మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం తాము కూడా పోరాటం చేస్తున్నామని పలు పార్టీల నేతలు ప్రకటిస్తున్నారు. తమతో కలిసి రావాలని అంటున్నారు.

కాగా, పవన్.. నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికతో ముందుకొచ్చారని, ప్రజల అభిప్రాయాలనే తన మాటల ద్వారా ప్రతిబింబించారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో ఆదవారం వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు.

హోదా కోసం రాజకీయాలను పక్కన పెట్టి, కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తొలుత ప్రజల్లోకి వెళ్లి, ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పవన్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారన్నారు.

ప్రత్యేక హోదాపై పవన్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని మంత్రి రావెల కిశోర్‌బాబు గుంటూరులో తెలిపారు. హోదా కోసం ఎవరు పోరాడినా మంచిదేనని, దాని వల్ల ప్రత్యేక హోదా ఉద్యమానికి కొత్త ఊపు వస్తుందన్నారు.

Ganta Srinivasa Rao on Pawan Kalyan comments

వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్‌ పార్టీలు హోదా పేరుతో కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులో అన్నారు.

దేశంలోనే అత్యంత సమర్థ రాజకీయ నేతగా, సీఎంగా చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రత్యేక హోదాపై పవన ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.

టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశకు రాజధాని అవసరం లేదా అని వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్‌ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. త్వరితగతిన జరిగే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసమని హైదరాబాద్‌లో నిలదీశారు.

'మేం చదువుకున్న రోజుల్లో ఆ అంటే అమ్మ అని, ఆ అంటే ఆవు అని చెప్పేవారు. ఇప్పుడు అ అంటే అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్' అని చెబుతున్నారని చెప్పారు. ఆంగ్ల అక్షరాల్లో ఏ అంటే ఆంధ్రప్రదేశ, బీ అంటే బాబు, సీ అంటే క్యాపిటల్‌, డీ అంటే డెవల్‌పమెంట్‌ అని చెప్పుకొంటున్నారని ఆమె కొత్త నిర్వచనాలిచ్చారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ విషయంలో ఏ అంటే అరెస్టు, బీ బెయిల్‌, సీ అంటే కోర్టు, డీ అంటే డిస్ట్రక్షన్‌ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని రేణుక ఎద్దేవా చేశారు.

English summary
Andhra Pradesh Minister Ganta Srinivasa Rao responded on Janasena Party president Pawan Kalyan's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X