వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో 'అక్వా జుంబా డ్యాన్స్' కోసం యువతుల క్యూ: ఏమిటిది?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: విశాఖలొ కొత్త రకం డ్యాన్స్ రంగ ప్రవేశం చేసింది. డ్యాన్స్ అక్వా జుంబా పేరిట సరికొత్త రీతిలో వచ్చిన ఇది.. స్థానిక మహిళలు, యువతులను ఆకట్టుకుంటోంది. స్విమ్మింగ్ పూల్‌లో నడు లోతు వరకు నీటిలో దిగి ఇన్ స్ట్రక్టర్ చెప్పే నృత్య రీతులను అనుకరిస్తున్నారు.

స్థానిక మహిళలు పలువురు తమ శరీరంలోని అధిక బరువును ఇట్టే తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నారు. నీటిలో దాదాపు రెండు గంటలకు పైగా ఏకబిగిన సాగే ఈ అక్వా జుంబా డ్యాన్సులో శారీరక శ్రమ పెద్దగా లేకుండానే శరీరంలోని కొవ్వు శాతం సులువుగా కరిగిపోతుందని తెలుస్తోంది.

Get fit with aqua zumba in the pool

ఇప్పటి దాకా పలువురు మహిళలు అక్వా జూంబాదో సందడి చేస్తున్నారు. ఈ కొత్త రకం డ్యాన్స్ చేసేందుకు పలువురు మహిళలు వరుస కడుతున్నారు. కొవ్వు కరిగించుకునేందుకు మహిళలు, యువతులు ఈ కొత్త రకం డ్యాన్స్ పైన ఆసక్తి చూపిస్తున్నారట.

శనివారం సాయంత్రం ఫిట్‌నెస్ మక్కువదారులు పలువురు ఓ వ్యాలీలోని స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. వారు కేవలం ఈత కోసమే కాదు.. అక్వా జుంబా కోసం వెళ్లారు. ఈత రాని వారు కూడా ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

English summary
Those who have been looking forward to break away from run of the mill workout and add energy-packed aquatic exercise to their fitness menu, here is a chance to get into the pool and make a splash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X