వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ పార్టీ మంత్రివర్గం ఇది? ఏం చేస్కుంటారో చేస్కోండి: గోరంట్ల సంచలనం

మంత్రి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు.. తమ కలలు కల్లలు కావడంతో తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. రాజకీయం వ్యాపారంగా మారిందని, దీంతో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారని తాజాగా,

|
Google Oneindia TeluguNews

అమరావతి: మంత్రి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు.. తమ కలలు కల్లలు కావడంతో తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. రాజకీయం వ్యాపారంగా మారిందని, దీంతో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారని తాజాగా తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటుగా స్పందించడం గమనార్హం.

అందుకే మాట్లాడుతున్నా..

అందుకే మాట్లాడుతున్నా..

హోం మంత్రి చినరాజప్ప ఆయన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత మంత్రివర్గం ఏ పార్టీదో కూడా తెలియడం లేదంటూ గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి మేలు జరగాలనే ఉద్దేశంతోనే బహిరంగంగా తాను మాట్లాడుతున్నానని అన్నారు.

ఏం చర్యలు తీసుకుంటారు?

ఏం చర్యలు తీసుకుంటారు?

‘నేనేం తప్పు మాట్లాడలేదు. ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోమనండి. కేబినెట్ ఏ పార్టీదో చెప్పుకోలేని పరిస్థితి ఉంది' అంటూ గోరంట్ల మండిపడ్డారు. తనకు నష్టం జరిగినా కూడా ఇలాంటి రాజకీయం తాను చేయబోనని, టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.

పని చేయని బుజ్జగింపు..

పని చేయని బుజ్జగింపు..


రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ఆవేదననే తాను వెలిబుచ్చానని పేర్కొన్నారు. టీడీపీ అధినేత తీరును నిరసి స్తూ ఆదివారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన గోరంట్ల బుచ్చ య్య చౌదరిని బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజ మహేంద్రవరం వచ్చారు. గోరంట్లతో దాదాపు గంటసేపు ఏకాంతంగా చర్చలు జరిపిన తర్వాత కొంత శాంతించినట్లుగా కనిపించినా తన అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేశారు.

కట్టుబడి ఉన్నానంటూనే..

కట్టుబడి ఉన్నానంటూనే..

పార్టీలో క్రమశిక్షణ ఉంటే ఇలా జరిగి ఉండే ది కాదన్నారు. పార్టీని తిట్టిన వారిని, పార్టీ ఫిరా యించి వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయబారాలు, బుజ్జగింపులు తనకు అవసరంలేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు, రాసిన లేఖకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. వైయస్సార్‌ సీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం సిద్ధాంతాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గన్‌మన్లను వెనక్కి పంపేస్తున్నట్లు ప్రకటించారు.

English summary
Senior political leader gorantla buchaiah chowdary fired at TDP High Command for not giving minister post to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X