వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంపై అసంతృప్తి: తెలుగులో ప్రారంభించి, తెలుగులో ముగించిన గవర్నర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని గవర్నర్ నరసిహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉభయ సభలను ఉద్దేశించి ఆయన శనివారం ప్రసంగిస్తున్నారు. విభజన వల్ల జరిగిన నష్టాలపై గత సభలో చర్చించామని, విభజన హేతుబద్దంగా జరగలేదని ఆయన అన్నారు. ఎపిలో ఆర్థిక లోటు ఉందని చెప్పారు. కేంద్రం నుంచి మరింత సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర విభజనతో తీవ్రమైన ఆర్థిక లోటు ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం చూస్తున్నట్లు చెప్పారు. తుఫాను, కరువు వల్ల ఎపి తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. 2029నాటికి దేశంలోనే ఎపిని నెంబర్ వన్‌గా చూడాలనేది లక్ష్యమని చెప్పారు. 9 నెలల్లో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. ఎపి ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలబడాలంటే ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన అన్నారు

Narasimhan

కేంద్రం నుంచి సరైన సాయం అందలేదని చెప్పారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి కేంద్ర సాయం తప్పనిసరి అని చెప్పారు. రాఝులో రెండంకెల అభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎపి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు లెలిపారు. ఆర్థిక సంఘం సిఫార్సులు తీవ్ర నిరాశను కలిగించాయని ఆయన అన్నారు. కరువు ప్రాంతాలకు వరద నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు.

2018 నాటికి పోలవరం పూర్తి

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరానికి వంద కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం కేటాయించడం అసంతృప్తి కలిగించిందని ఆయన అన్నారు. కరువు ప్రాంతాలకు వరద నీటిని తరలిస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం మూడు రెట్లు పెంచినట్లు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో వ్యవహరించాలని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేసినట్లు ఆయన తెలిపారు.

అల్లూరి సీతామారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. దీర్ష కాలిక లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అన్నారు. నదుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో 93 శాతం రైతులు అప్పుల్లో ఉన్నట్లు తెలిపారు. సహజ వనరుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. డ్రిప్ ఇర్రిగేషన్, స్పింక్రర్ విధానాలను ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది 4 ఓడరేవులను నిర్మిస్తామని చెప్పారు. 2015-16 నాటికి రాష్ట్రంలో పదివేల సోలార్ పంపుసెట్ల ఏర్పాటు లక్ష్యమని ఆయన చెప్పారు. జన్మభూమి, మా వూరు పథకాల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

రాష్ట్రాన్ని ఆక్వా కేపిటల్‌గా రూపుదిద్దుతామని చెప్పారు. వెనకబడిన తరగతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆదివాసీల కోసం గిరిపుత్రిక కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని గవర్నర్ చెప్పారు. ఆగస్టు 9న ఆదివాసీ దివస్‌గా పాటిస్తామని అన్నారు. విజన్ 2050 డాక్యమెంటును రూపొందిస్తున్నట్లు తెలిపారు.ఎపిని లాజిస్టిక్ హబ్‌గా మారుస్తామని అన్నారు. రాష్ట్రంలో అంతర్గత భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

వరల్డ్ క్లాస్ రాజధాని

వరల్డ్ క్లాస్ రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాదిి జూన్ నాటికి రాజధాని మాస్టర్ ప్లాన్ వస్తుందని చెప్పారు. జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా సహకారంతో రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. గోదావరి జిల్లాలను కృష్ణానదికి తరలించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని రంగాలకు నిరంతర విద్యుత్తు ఇచ్చే రాష్ట్రంగా ఎపి ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ 1నుంచి తెల్లరేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ పథకం ప్రారంభమవుతుందని చెప్పారు.

ప్రస్తుతం ఎపి తలసరి ఆదాయం సంతృప్తికరంగా ఉందని చెప్పారు. జిల్లాలవారీగా పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తామని అన్నారు.ఎపిని విద్యాహబ్‌గా మారుస్తామని ఆయన చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి ముందుకు రావాలని అందరినీ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. రాజధానికి సహకారం అందించాలని కోరారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి, తెలుగులో ముగించారు.

English summary
Governor Narasimhan addressed the both the houses of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X