వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంపై మీ వైఖరేంటి?: కేంద్రానికి గ్రీన్ ట్రిబ్యునల్‌ సూటి ప్రశ్న

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎంతో కీలకమైన ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ ఆసక్తికర ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టుపై మీ వైఖరేమిటో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ నిలదీసింది. దీంతో పాటు ప్రతిఏటా పోలవరం ప్రాజెక్టు పనులపై స్టార్ వర్క్ ఆర్డర్స్ ఎందుకు పొడిగిస్తున్నారంటూ ప్రశ్నించింది.

పోలవరం ప్రాజెక్టుపై మీ వైఖరేంటో చెప్పాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. వీటితోపాటు కేంద్రం జారీ చేసిన పర్యావరణ అనుమతులపై కూడా ట్రిబ్యునల్‌ పలు ప్రశ్నలను సంధించింది. రెండు వారాల్లోగా దీనిపై సమగ్ర వివరాలతో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

Green tribunal questions about center on polavaram project

పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఒడిశా వాసి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్‌ సెప్టెంబర్ 5న పూర్తి సమాచారంతో రావాలని కేసు విచారణను వాయిదా వేసింది.

ఈ క్రమంలో సోమవారం ట్రిబ్యునల్‌ పై వ్యాఖ్యలు చేసింది. గత విచారణలో పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టాప్ ‌వర్క్ ఆర్డర్‌పై సమాచారం ఎందుకు ఇవ్వలేదని సైతం కేంద్రాన్ని ఎన్‌జీటీ ప్రశ్నించింది. గతంలో పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి కూడా ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.

English summary
The National Green Tribunal (NGT) on Tuesday sought the response of the Ministry of Environment and Forests (MoEF) on the status of implementation of the Polavaram project stop-work order issued earlier by the ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X