వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమకు అడ్డు అని బావపై దాడి, ప్రియురాలు దీక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు/అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో గురువారం దారుణం జరిగింది. తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని యువతి బావ పైన ఓ యువకుడు దాడి చేశాడు. అతను కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో ఆ బావ తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు.

Guntur girl stage dharna at lover's residence

ప్రియురాలు దీక్ష

ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ ప్రియురాలు దీక్షకు దిగిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. ఆమె అతని ఇంటి ముందు బైఠాయించింది. ముగ్గురోడ్డుకు చెందిన అనిల్‌ తన ఇంటి సమీపంలోని యువతిని ప్రేమిస్తున్నానని ఆరేళ్లుగా వెంట పడ్డాడు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్నాడు. తీరా ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని ఆ యువతి ఆరోపించారు. అతను తప్పించుకొని తిరుగుతున్నందున ఆమె ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఆమెకు మద్దతుగా స్థానిక మహిళలు కూడా అక్కడకు చేరుకున్నారు.

కారు చెట్టుకు ఢీకొని ముగ్గురు మృతి

వేగంగా వస్తున్న కారు చెట్టుకు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం దేవగంటి దగ్గర జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

English summary
Guntur girl stage dharna at lover's residence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X