వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెన్సీ రద్దు: వెళ్లి కష్టాలు తెలుసుకున్న ఎంపీ గల్లా జయదేవ్, 'సిద్ధార్థ'కు దుర్గగుడి భూమి

|
Google Oneindia TeluguNews

విజయవాడ/గుంటూరు: రూ.500, రూ.1000 నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కష్టాలు తెలుసుకునేందుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గంలో పర్యటించారు. గుంటూరులోని ఓ రైతు బజార్, సీఎం నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయం అడిగారు.

బ్యాంకులలోకి వెళ్లి ఖాతాదారులతో మాట్లాడారు. ప్రజల చెప్పిన వాటిని పార్లమెంటులో ప్రస్తావిస్తానని చెప్పారు. నోట్లు రద్దు చేసిన తొలి రెండు మూడు రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు పరిస్థితి కొంత మారిందని చెప్పారు. ఓ మంచి పని కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో కరెన్సీ అందుబాటులోకి తేవాలన్నారు.

galla jayadev

ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు

మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు భేటీ జరిగింది. పెద్ద నోట్ల రద్దు తదితర కీలక అంశాల పైన వారు చర్చించారు. అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావులు వెల్లడించారు.

విశాఖ ఉడా పరిధిలో పూలింగ్‌ స్కీంకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దుర్గగుడికి చెందిన 14.2 ఎకరాలను సిద్ధార్థ కాలేజీకి కేటాయించడం. ఎకరాకు రూ.లక్షన్నర చొప్పున కేటాయింపు. మూడేళ్ల కోసారి ఐదు శాతం లీజు పెంచాలని నిర్ణయించారు.

రూ.300 కోట్లతో సెట్‌టాప్‌ బాక్సులు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధిలో అమృతా విశ్వవిద్యాలయానికి 200 ఎకరాల కేటాయింపు. ఆర్బీఐకి 16 ఎకరాలు, సీపీడబ్బ్యూకు 28 ఎకరాలు కేటాయింపు.
పల్స్‌ సర్వే నెలాఖరుకు పూర్తి చేయడం, సర్వేల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

English summary
Guntur MP Galla Jayadev enquiries people about currency ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X