గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త:అమరావతిలో హెచ్ సి ఎల్ డెవలప్ మెంట్ సెంటర్, వెయ్యి కోట్ల పెట్టుబడి

దేశంలోనే అతి పెద్దదైన హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ ఆంద్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించనుంది. ఈ మేరకు వెయ్యి కోట్లను పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, హెచ్ సి ఎల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:దేశంలోనే నాలుగో అతి పెద్ద సర్వీసెస్ కంపెనీ హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ ఆంద్రప్రదేశ్ లో తన బ్రాంచ్ ను ఏర్పాటు చేయనుంది.ఈ సెంబర్ కోసం సుమారు 30 ఎకరాల భూమి అవసరమౌతోంది. డెవలప్ మెంట్ సెంటర్ కోసం వెయ్యి కోట్ల రూపాయాలను పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంది.

అతిపెద్ద డెవలప్ మెంట్ సెంటర్లలో ఒకదాన్ని ఆంద్రప్రదేశ్ లో నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. దీని కింద మొత్తం రూ.1000 కోట్ల పెట్టుబడులను హెచ్ సి ఎల్ పెట్టనుంది.ఈ విషయమై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో అగ్రిమెంట్ కుదుర్చుకోనుంది.

HCL Development centre will be launched at amaravati

గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అమరావతిలో దీన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ఓ ఐటి దిగ్గజం పెట్టబోతున్న అతి పెద్ద ఇన్వెస్ట్ మెంట్ ఇదే కానుంది.అయితే ఈ వార్తలపై హెచ్ సిఎల్ టెక్నాలజీస్ ఇంతవరకు మాత్రం అధికారికంగా స్పందించలేదు.

ఈ డెవలప్ మెంట్ సెంటర్ కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాలకు పైగా భూములను సేకరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

English summary
HCL Development centre will be launched at amaravati.Andhra pradesh governament and HCL will be agreement soon said officers.HCL invest for this development centre around Rs.1000 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X