వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్యాక్స్ కట్టొద్దు, కానీ: తెలంగాణ ట్యాక్స్‌పై ఏపీ వాహనదారులకు ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర రవాణా పన్ను విధానం పైన హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రవాణా పన్ను జీవోను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రయివేటు ట్రావెల్స్ యజమానులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.

ఇవాళ్టి నుండి అమలులోకి వచ్చిన ఈ ట్యాక్స్ విధానం తమ పైన భారం పడుతోందని, దీనిని వెనక్కి తీసుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ట్రావెల్స్ యాజమాన్యం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రవాణా పన్నును విరమించుకునేలా ఆదేశాలివ్వాలని వారు కోరారు.

కోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పెంపుతో ప్రయాణీకులు, సామాన్యుల పైన భారం పడుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్ పైన మంగళవారం మధ్యాహ్నం హైకోర్టులో వాదనలు జరిగాయి.
వాదనలు విన్న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

High Court interim order on Telangana government to levy tax on AP's vehicles

పిటిషన్ దాఖలు చేసిన వారికి రవాణా పన్ను మినహాయించాలని ఆదేశించింది. తద్వారా కోర్టుకు వచ్చిన వాళ్లు తప్ప మిగతా వాళ్లు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు ట్యాక్స్ వసూలు చేయవద్దని ఆదేశించింది. చెక్ పోస్టుల వద్ద వాహనదారులు హామీ పత్రాలు ఇవ్వాలని చెప్పింది. ఇది ఏపీ ప్రయివేటు వాహన యజమానులకు ఊరట అని చెప్పవచ్చు. కాగా, కోర్టు కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

English summary
High Court interim order on Telangana government to levy tax on AP's vehicles
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X