వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త చిక్కులు: ఇది హిందూపురం ఏకపక్షం సాగదు, బాలయ్య ఫోన్

సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి సమస్య వచ్చిపడింది. హిందూపురం మున్సిఫల్ చైర్మెన్ లక్ష్మికి, కమిషనర్ విశ్వనాథ్ ల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు చోటుచే

By Narsimha
|
Google Oneindia TeluguNews

హిందూపురం:సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి సమస్య వచ్చిపడింది. హిందూపురం మున్సిఫల్ చైర్మెన్ లక్ష్మికి, కమిషనర్ విశ్వనాథ్ ల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు చోటుచేసుకొన్నాయి. సోమవారం జరిగిన సమావేశంలో ఇద్దరు కూడ నువ్వెంత నీవెంత అంటూ దూషించుకొన్నారు.

హిందుపురం అసెంబ్లీ స్థానం నుండి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బాలకృష్ణ పోటీచేశారు.అయితే ఈ నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను చక్కబెట్టేందుకుగాను బాలయ్య తన పిఎ శేఖర్ ను నియమించాడు.

అయితే బాలయ్య పిఎ శేఖర్ వ్యవహరశైలిపై పార్టీ నాయకులు బహిరంగంగానే ధ్వజమెత్తారు.ఈ విషయమై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దరిమిలా బాలయ్య పిఎ శేఖర్ ను అక్కడి నుండి తప్పించారు.దీంతో పార్టీ నాయకులు శాంతించారు.

మరో వైపు పిఎ శేఖర్ స్థానంలో వీరయ్యను బాలయ్య హిందూపురంలో నియమించారు. గత అనుభవాల దృష్ట్యా వీరయ్య జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.అయితే ఇదే సమయంలో హిందూపురం మున్సిఫల్ చైర్మెన్ లక్ష్మి, కమిషనర్ మధ్య విబేధాలు బాలయ్యకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి.

బాలయ్యకు కొత్త చిక్కులు తెచ్చిన హిందూపురం మున్పిఫల్చైర్మెన్

బాలయ్యకు కొత్త చిక్కులు తెచ్చిన హిందూపురం మున్పిఫల్చైర్మెన్

హిందూపురం మున్సిఫల్ చైర్మెన్ లక్ష్మి, మున్సిఫల్ కమిషనర్ విశ్వనాథ్ ల మద్య విబేధాలు తీవ్రమయ్యాయి.ఈ విబేదాల నేపథ్యంలో మున్సిఫల్ సమావేశం నిర్వహించకుండా ఇంతకాలంపాటు జాప్యం చేశారు. మున్సిఫల్ సమావేశం నిర్వహించాలంటూ బాలయ్య మున్సిఫల్ చైర్మెన్ లక్ష్మికి, మున్సిఫల్ కమిషనర్ విశ్వనాథ్ ను ఆదేశించాడు.మార్చి 31వ, తేది గడువులోపుగా సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉన్నందున బాలయ్య జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

మున్సిఫల్ చైర్మెన్, కమిషనర్ ల మధ్య రాజీయత్నాలు

మున్సిఫల్ చైర్మెన్, కమిషనర్ ల మధ్య రాజీయత్నాలు

మున్సిఫల్ చైర్మెన్ లక్ష్మి, కమిషనర్ విశ్వనాథ్ ల మద్య సయోధ్య కోసం బాలయ్య ప్రయత్నాలను ప్రారంబించారు.సంస్థాగత ఎన్నికల కోఆర్డినేటర్ కృష్ణమూర్తి, బాలకృష్ణ పిఏ వీరయ్య ను హిందూపురం నియోజకవర్గానికి పంపారు.చైర్ పర్సన్ ఛాంబర్ లో ఈ ఇద్దరు కూడ వేర్వేరుగా సమావేశమయ్యారు. కౌన్సిలర్లతో కూడ వారు చర్చించారు.కమిషనర్ తీరుతో మున్సిఫల్ చైర్మెన్, కౌన్సిలర్లు ఆమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్దమంటూ ప్రకటించారు.

తానున్నానంటూ బాలయ్య ఫోన్ తో మెత్తబడ్డ ప్రజా ప్రతినిధులు

తానున్నానంటూ బాలయ్య ఫోన్ తో మెత్తబడ్డ ప్రజా ప్రతినిధులు

అయితే రాజీకోసం ఇద్దరు ప్రతినిధులు బాలయ్య పంపినా ప్రజా ప్రతినిధులు మాత్రం సానుకూలంగా స్పందించలేదు.దీంతో ఈ విషయాన్ని వారు బాలయ్యకు చేరవేశారు.అయితే తానున్ననంటూ బాలయ్య ఫోన్ చేశాడు. దీంతో ప్రజా ప్రతినిధులు కాస్త మెత్తబడ్డారు.దీంతో సమావేశం నిర్వహణకు ప్రజా ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

కమిషనర్ తీరుపై ధ్వజమెత్తిన పాలకవర్గం

కమిషనర్ తీరుపై ధ్వజమెత్తిన పాలకవర్గం

మున్సిఫల్ పాలకవర్గం పట్ల కమిషనర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజాప్రతినిధులు తప్పుబట్టారు.అధికారులను పనిచేయకుండా కమిషనర్ అడ్డుపడుతున్నాడంటూ వారు ధ్వజమెత్తారు.పాలకమండలి ఎందుకు అంటూ వారు తమ నిరససను వ్యక్తం చేశారు. ఖద్దరు బట్టలు వేసుకొని కమిషనర్ ను పాలన సాగించాలని వారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.అయితే ప్రజాప్రతినిధుల తీరును కమిషనర్ కూడ తప్పుబట్టారు. తన పరిధిలోని పనులను తాను చేస్తానని ఆయన చెప్పారు.

ఇది హిందూపురం ఏకపక్ష పాలన సాగదు

ఇది హిందూపురం ఏకపక్ష పాలన సాగదు

బాలయ్య జోక్యంతో హిందూపురం మున్సిఫల్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో కమిషనర్ పై కౌన్సిలర్లు, మున్సిఫల్ చైర్మెన్ సీరియస్ అయ్యారు. ఇది హిందూపురం ఏకపక్షంగా వ్యవహరిస్తే ఊరుకోమని వారు తీవ్రంగానే హెచ్చరించారు.తమను గెలిపించిన ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలంటూ వారు ప్రశ్నించారు.చేతకాకపోతే బదిలీ చేసుకొని వెళ్ళిపోవాలని పాలకవర్గం కమిషనర్ ను హెచ్చరించినట్టు సమాచారం.

English summary
hindupur municipal chairperson and other councilers allegations on commissioner vishwanth. hindupur mla balakrishna intervene in this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X