వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరి చక్రం తిప్పుతున్నారా? చంద్రబాబుపై గేరు మార్చిన బిజెపి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బిజెపిలు దగ్గరవుతున్నాయా? వచ్చే ఎన్నికల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిజెపి పెద్ద షాక్ ఇవ్వనుందా? అంటే పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బిజెపిలు దగ్గరవుతున్నాయా? వచ్చే ఎన్నికల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిజెపి పెద్ద షాక్ ఇవ్వనుందా? అంటే పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు.

వైసిపి ప్లీనరీలో జగన్ ఏపీకి ఎంతో ముఖ్యమని చెబుతున్న ప్రత్యేక హోదా గురించి బిజెపిని పెద్దగా టార్గెట్ చేయలేదు, బిజెపి నేతలు ఇటీవల మరోసారి అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు బిజెపి నేతలను వైసిపి వారు కలుస్తున్నారు.

<strong>చంద్రబాబుకు బిగ్ షాక్: మోడీతో లక్ష్మీపార్వతి భేటీ, దేనికి సంకేతం?</strong>చంద్రబాబుకు బిగ్ షాక్: మోడీతో లక్ష్మీపార్వతి భేటీ, దేనికి సంకేతం?

పరిణామాలు చూస్తుంటే 2019 నాటికి జగన్, బిజెపి ఒక్కటి అవుతారని, చంద్రబాబుకు షాక్ తప్పదని అంటున్నారు. రానున్న ఎన్నికలు ప్రధానంగా త్రిముఖ పోటీయే అంటున్నారు. ఓ వైపి టిడిపి, మరోవైపు బిజెపి-వైసిపి, ఇంకోవైపు పవన్ కళ్యాణ్, మిత్రపక్షాలు ఉంటాయని భావిస్తున్నారు.

పురంధేశ్వరి చక్రం తిప్పుతున్నారా?

పురంధేశ్వరి చక్రం తిప్పుతున్నారా?

కొద్ది రోజుల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సమయంలో సిఎం చంద్రబాబు కొందరు బిజెపి నేతలు చేస్తున్న విమర్శలపై ఫిర్యాదు చేశారు. మిత్రపక్షాలం కాట్టి ఆయన వారించి వెళ్లారు. కానీ ఆయన వెళ్లిన కొద్ది రోజులకే సోము వీర్రాజు, విష్ణు కుమార్ రాజు తదితరులు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. టిడిపితో అంటకాగితే నష్టమని భావించే, దానికి దూరం జరిగే వ్యూహంలో భాగంగానే నేతలు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ మొత్తం వెనుక పురంధేశ్వరి చక్రం తిప్పుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.

దీని వెనుక ఎవరు?

దీని వెనుక ఎవరు?

గతంలో పురంధేశ్వరితో జగన్, రోజాలు భేటీ అయినట్లుగా వార్తలు వచ్చాయి. జగన్ ప్రధాని మోడీతో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా లక్ష్మీ పార్వతి కూడా ప్రధానితో భేటీ అయ్యారు. ప్లీనరీ అవగానే ఈ అపాయింటుమెంట్ ఎవరు ఇప్పించారనే చర్చ సాగుతోంది. దీని వెనుక పురంధేశ్వరి ఉండి ఉంటారని అంటున్నారు. చంద్రబాబును పక్కన పెట్టేలా ఏపీలో బిజెపి, వైసిపి నేతల మద్య చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

వ్యూహాత్మక మౌనం.. గేరు మార్చిన బిజెపి

వ్యూహాత్మక మౌనం.. గేరు మార్చిన బిజెపి

బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా వచ్చి వెళ్లిన తర్వాత పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివ రావు వంటి నేతలు అధికార పార్టీపై విమర్శలు చేయడం లేదు. అంతకుముందు వారు ఒంటికాలిపై లేచే వారు. దీంతో కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వచ్చిన వారే తమపై విమర్శలు చేస్తున్నారని టిడిపి నేతలు మండిపడ్డారు. అమిత్ షా పర్యటన తర్వాత వారు సైలెంట్ అయ్యారు. మొదటి నుంచి బిజెపిలో ఉన్న నేతలు సోము వీర్రాజు, విష్ణు కుమార్ రాజు వంటి వారు సమయం వచ్చినప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే బిజెపి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

ఎన్టీఆర్ ఇమేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు..

ఎన్టీఆర్ ఇమేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు..

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇమేజ్‌ను ఇప్పటి వరకు టిడిపి క్యాష్ చేసుకుంది. హరికృష్ణ, లక్ష్మీపార్వతిలు క్యాష్ చేసుకునే ప్రయత్నం ఎప్పుడో చేసి విఫలమయ్యారు. పురంధేశ్వరి తండ్రికి తగినట్లుగా కాంగ్రెస్‍‌లో ఉన్నా, బిజెపిలో ఉన్న రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు బిజెపి పురంధేశ్వరి ద్వారా ఎన్టీఆర్ ఇమేజ్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేయవచ్చునని అంటున్నారు.

Recommended Video

Gali Janardhan Reddy Behind BJP-Jagan Friendship
ఇద్దరూ చంద్రబాబు వ్యతిరేకులే..

ఇద్దరూ చంద్రబాబు వ్యతిరేకులే..

ఇప్పుడు, లక్ష్మీపార్వతి ప్రధాని మోడీని కలిశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టిడిపితో పాటు లక్ష్మీపార్వతి, పురంధేశ్వరి వంటి వారు కోరుతున్నారు. అవార్డు ఇచ్చే పరిస్థితి ఉంటే అది టిడిపి ఒక్కదానికే క్రెడిట్ దక్కకుండా చేయడంలో భాగంగానే లక్ష్మీపార్వతి కలిసి ఉంటారని అంటున్నారు. చంద్రబాబు అంటే ఇటు పురంధేశ్వరికి, అటు లక్ష్మీపార్వతికి పడదు. వైసిపి - బిజెపిలు ఒక్కటయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతికి పురంధేశ్వరియే అపాయింటుమెంట్ ఇప్పించి ఉంటారని, శత్రువును దెబ్బతీసేందుకు రాజకీయంగా వీరిద్దరు ఒక్కటైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

English summary
It is said that, BJP leader Purandeswari behind YSR Congress Party leader Lasmi Parvathi meeting With Prime Minister Narendra Modi in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X