వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనున్నా భయపడొద్దు, ఆమరణ నిరాహార దీక్ష: పవన్, బాబుపై సెటైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఎర్రపాలెం/బేతపూడి: రాజధాని ప్రాంతమైన ఎర్రపాలెం, బేతపూడి గ్రామాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్యటించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్యాకేజీ మీకు నచ్చి భూములు ఇస్తామంటే తాను ఇక్కడి నుండి మౌనంగా వెళ్తానని, తనకు అభ్యంతరం లేదని, కానీ ప్రభుత్వం భూములు లాక్కుంటే మాత్రం అవసరమైతే తాను ఇక్కడే ఉండి పోరాటం చేస్తానని రైతులకు, గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

దేవుడిలా వచ్చారు.. జీవితకాలం రుణపడి ఉంటాం

తాము ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని, ఎప్పుడొస్తుందో తెలియని పరిహారం కోసం తాము తమ పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టలేమని రైతులు చెప్పారు. తాము భూములు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. బలవంతంగా భూములు లాక్కుంటున్నారని, మీరు తమకు న్యాయం జరిగేలా చూస్తే జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పారు. మిమ్మల్నే నమ్ముకున్నామని రైతులు చెప్పారు.

నాకు కూరగాయల తోట ఉంది, రైతు కష్టం తెలుసు

I am ready to indefinite fast for farmers, says Pawan Kalyan

రైతుల కష్టాలు విన్న పవన్ మాట్లాడుతూ.. తనకు కూరగాయల తోట ఉందని, రైతుల కష్టం తనకు తెలుసునని చెప్పారు. నేను కూడా రైతు కుటుంబం నుండే వచ్చానని చెప్పారు. మీరు స్వచ్చంధంగా భూమి ఇస్తే సంతోషిస్తానని చెప్పారు. ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే పోరాటం చేస్తానని చెప్పారు. ప్రభుత్వానికి కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నానని, ఎంత అవసరమైతే అంతే తీసుకోవాలన్నారు.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తా

ఎంత భూమి అవసరమైతే అంతే తీసుకోవాలన్నారు. తాకట్టు భారతంగా మార్చవద్దని హితవు పలికారు. గ్రామీణ భారతం ముఖ్యమన్నారు. రాజధాని కోసం గ్రామీణ భారతాన్ని నాశనం చేయవద్దన్నారు. అసలు 33వేల ఎకరాల భూమి అవసరమా అని ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తిరుగుబాటు తెచ్చి విప్లవాలు వచ్చేలా పాలకులు చేయవద్దన్నారు. రైతుల భూమి బలంగా లాక్కుంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధమని తెలిపారు.

సింగపూర్ తరహా రాజధాని అవసరమా

ఏపీకి సింగపూర్ తరహా రాజధాని అవసరమా అని ప్రశ్నించారు. అత్యవసరం అయితే భూమి తీసుకోవాలని రాజ్ నాథ్ చెప్పారని, బీడు భూమి అయితే అభివృద్ధి కోసం వాడుతామని పార్లమెంటులో చెప్పారన్నారు. మీ కన్నీళ్లు, కష్టాలతో భూములు లాక్కుంటే నేను పోరాడుతానని చెప్పారు. భూసేకరణ చట్టం గురించి తాను ఇంకా పూర్తిగా చదవవలసి ఉందని
చెప్పారు. మీ సమస్యలు తీరే వరకు అవసరమైతే ఇక్కడే ఉంటానని చెప్పారు.

ఈ క్షణం నుండే మీ వెంట ఉంటా

నేను మరో అయిదేళ్ల తర్వాత రావడం లేదని, ఈ క్షణం నుండే మీ వెంట ఉంటాని చెప్పారు. రాజధానికి ఎంత భూమి అవసరమైతే అంతే తీసుకోవాలని చెప్పారు.

విడిపోయాక ఇబ్బందులు వచ్చాయి.. టీడీపీకి మద్దతు పలికా

రాష్ట్రం విడిపోయాక ఏపీకి అనేక ఇబ్బందులు వచ్చాయని పవన్ అన్నారు. ఆదాయం పడిపోయిందని, ఏపీకి ఇబ్బందులు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న టీడీపీకి మద్దతు పలికానని చెప్పారు. ప్రచారం కూడా చేశానన్నారు.

వైసీపీ వారా అనేది అనవసరం.. టీడీపీ ప్రభుత్వం పైనా పోరాడుతా

రైతులు సంతోషంగా ఉన్నారా లేదా అనేది తనకు ముఖ్యమని, రైతుల కన్నీటితో సింగపూర్ లాంటి రాజధాని అవసరమా అన్నారు. రైతుల కన్నీటితో రాజధాని అవసరమా అనేది తన ప్రశ్న అన్నారు.

చంద్రబాబుకు సింగపూర్ లాంటి రాజధాని కావాలి కానీ...

చంద్రబాబుకు సింగపూర్ లాంటి రాజధాని కావాలని, దానికి అభ్యంతరం లేదని సెటైర్ వేశారు. అయితే రైతుల కన్నీటితో రాజధాని వద్దని చెప్పారు. బలవంతంగా భూములు తీసుకుంటే మీరు భయపడొద్దని, మీ పొలాలు ఎవరు లాక్కోరని, నేను పోరాడుతానని చెప్పారు. దేనికీ భయపడవద్దని చెప్పారు. అత్యవసరమైతేనే భూమి సేకరించాలన్నారు. ఓ మహిళ మాట్లాడే సమయంలో తడపడగా.. మీరు దేనికీ భయపడవద్దని, మీ పొలాలు ఎవరూ లాక్కోరని పవన్ అన్నారు.

English summary
I am ready to indefinite fast for farmers, says Pawan Kalyan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X