విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా బస్సులు ఆపేస్తా, జగన్ బస్సుల మాటేమిటి, సారీ: బాబు క్లాస్‌తో తగ్గిన కేశినేని

విజయవాడ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఉదంతంపై టిడిపి నేతలు బోండా ఉమ, కేశినేని నానిలు ఆదివారం స్పందించారు. సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఉదంతంపై టిడిపి నేతలు బోండా ఉమ, కేశినేని నానిలు ఆదివారం స్పందించారు. సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

అధికారిపై రెచ్చిన ఎంపీ కేశినేని నాని: ఇదీ జరిగింది.. చంద్రబాబుకు వివరణఅధికారిపై రెచ్చిన ఎంపీ కేశినేని నాని: ఇదీ జరిగింది.. చంద్రబాబుకు వివరణ

రవాణా శాఖ కమిషనర్‌ను కలిసి తాము విచారం వ్యక్తం చేశామని బోండా, కేశినేని నాని చెప్పారు. నిన్న జరిగిన ఘటనను తాము సమర్థించుకోవడం లేదని చెప్పారు. ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెబుతున్నామన్నారు.

తమకు ఎలాంటి ఈగో లేదన్నారు. తెలిసో, తెలియకో ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెబుతున్నామన్నారు. ఈ రోజుతో ఈ సమస్య ముగిసిపోయినట్లేనని భావిస్తున్నామన్నారు.

నిన్న తాము ఓ ప్రజా సమస్యపై కార్యాలయానికి వెళ్లామని, మనస్పర్ధలతో వివాదం రాజుకుందని తెలిపారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని, విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు తమను మందలించారని తెలిపారు.

I am ready to stop my buses: Kesineni Nani

తమకు ఎలాంటి ఈగో లేదన్నారు. తెలిసో, తెలియకో ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెబుతున్నామన్నారు. ఈ రోజుతో ఈ సమస్య ముగిసిపోయినట్లేనని భావిస్తున్నామన్నారు.

నిన్న తాము ఓ ప్రజా సమస్యపై కార్యాలయానికి వెళ్లామని, మనస్పర్ధలతో వివాదం రాజుకుందని తెలిపారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని, విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు తమను మందలించారని తెలిపారు.

నా బస్సులు ఆపమంటే ఆపేస్తా

ప్రయివేటు బస్సుల అంశంపై మాట్లాడుతూ.. తన బస్సులు ఆపమని సీఎం చంద్రబాబు చెబితే ఆపేసేందుకు తాను సిద్ధమని కేశినేని నాని చెప్పారు. తనకు పార్టీ కంటే తన బస్సులు ముఖ్యం కాదని తేల్చి చెప్పారు.

అవసరమైతే నా సంస్థను (కేశినేని ట్రావెల్స్) మూసేస్తానని చెప్పారు. రవాణా శాఖలో కిందిస్థాయిలో అవినీతి ఉందన్నారు. నిన్న జరిగిన ఘటనకు వ్యక్తిగత వివాదం కారణం కాదని చెప్పారు. జగన్‌కు చెందిన బస్సులు అక్రమంగా తిరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో అధికారులతో కలిసి పని చేస్తామని చెప్పారు.

కాగా, రవాణా శాఖ అధికారిపై టిడిపి నేతల దాడి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వారికి చంద్రబాబు క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బోండా ఉమ తగ్గి, క్షమాపణ చెప్పినట్లుగా తెలుస్తోంది.

అంతకుముందు, రవాణా శాఖ జేఏసీ ఎంపీ, ఎమ్మెల్యే క్షమాపణకు డిమాండ్ చేసింది. తాము సాయంత్రం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని హెచ్చరించింది. వారు క్షమాపణ చెప్పాల్సిందేనని ప్రకటించాయి. చంద్రబాబు క్లాస్, ఉద్యోగుల హెచ్చరిక నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్సీ తగ్గినట్లుగా తెలుస్తోంది.

English summary
MP kesineni Nani on Sunday said that I am ready to stop buses if Chief Minister Chandrababu Naidu orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X