కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌కు జగన్ నివాళి: నాన్నను మిస్ అవుతున్నానంటూ ట్వీట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కడప జిల్లాలోని ఇడుపులపాయ వ్వవసాయక్షేత్రంలోని తన తండ్రి సమాధిని సందర్శించారు.

తల్లి విజయలక్ష్మీతో పాటు మొత్తం కుటుంబ సభ్యులందరితో కలిసి ఇడుపులపాయకకు వెళ్లిన వైయస్ జగన్, వైయస్ సమాధి వద్ద నివాళుల్పరించారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైయస్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రార్ధనలు నిర్వహించారు.

I Miss Dad Every Waking Moment: YS Jagan

ట్విట్టర్‌లో వైయస్‌పై తన అనుభూతులను పంచుకున్నారు. 'మా నాన్నను మిస్ అవుతున్నా. నా కష్టంలో వెన్నంటి నిలిచేలా అన్నింటిలో అండదండగా ఉండేలా కొండంత కుటుంబాన్ని నాకు ఇచ్చారు. ఆయన గొప్పతనం, స్ఫూర్తిదాయకమైన జీవితం, ఆయన అడుగుజాడల్లో నేను నడిచేలా మరింత ధైర్యాన్ని మీ మద్దతను నాకివ్వండి' అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.

వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు, వైయస్ఆర్ అభిమానులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైయస్ఆర్ 66వ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టారు.

ఆ ఘనత వైయస్‌దే: దానం నాగేందర్

I Miss Dad Every Waking Moment: YS Jagan

హైదరాబాద్ నగరానికి మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లాంటి ఘనమైన ప్రాజెక్టులు సాధించిన ఘనత ఆ మహానేత వైయస్‌దేనని మాజీ మంత్రి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు దానం నాగేందర్ తెలిపారు. మహానేత వైఎస్ఆర్ 66వ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ జయంతి కార్యక్రమంలో మల్లు భట్టివిక్రమార్క, దానం నాగేందర్, షబ్బీర్ అలీ, కేవీపీ రామచంద్రరావు, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, భారీ సంఖ్యలో ఆయన అభిమానులు హాజరయ్యారు.

ఇక అనంతపురంలో వైయస్ఆర్ 66వ జయంతిని పురస్కరించుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్ బాషా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వైయస్ఆర్ చేపట్టిన పథకాలు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు, విద్యార్థులు, రైతులు కష్టాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అవేమీ పట్టకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

English summary
You all daily give me the courage and support reminding me of his greatness and inspiring me to follow his path.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X