వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యూహం మార్చిన టిడిపి, నాడు భూమా 'సై' అంటే శిల్పా 'రాజకీయ సన్యాసమే', వైసీపీకి దెబ్బేనా?

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే నంద్యాలలో ఎన్నికల వేడి కొనసాగుతోంది.

Recommended Video

వైసీపీ, టిడిపిలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటివని రెండు పార్టీలు భావిస్తున్నాయి. నంద్యాల అసెంబ్లీ కేంద్రంగా చేసుకొని మంత్రి అఖిలప్రియ వ్యూహలను రచిస్తున్నారు.

మరోవైపు నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం కావాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది.ఈ విషయమై అసెంబ్లీలో వైసీపీకి విన్నవించాలని టిడిపి అభిప్రాయంతో ఉంది.దీంతో మరోసారి నంద్యాల ఉప ఎన్నికపై రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయి.

నంద్యాలలో వైసీపీ విజయం తథ్యం

నంద్యాలలో వైసీపీ విజయం తథ్యం

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుదవారం నాడు మీడియాతో మాట్లాడారు. తమ వ్యూహాలు తమకు ఉన్నాయన్నారు. టిడిపిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు.

నంద్యాలలో సవాళ్ళు కొత్తేమీ కాదు

నంద్యాలలో సవాళ్ళు కొత్తేమీ కాదు

2014 ఎన్నికల సమయంలో తన సవాల్ ను భూమా నాగిరెడ్డి స్వీకరించలేదన్నారు. ఆనాడు భూమానాగిరెడ్డి తన సవాల్ ను స్వీకరిస్తే రాజకీయ సన్యాసం స్వీకరించేవాడినని చెప్పారు. కానీ, అయితే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి ఓటమిపాలైతే తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని మంత్రి అఖిలప్రియ సవాల్ విసిరారు. అయితే వైసీపీ ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం తీసుకొంటానని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ విషయమై మరోసారి మంత్రి అఖిలప్రియ స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 నుండే శిల్పా, భూమా వర్గీయుల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి.

వ్యూహం మార్చుతున్న టిడిపి

వ్యూహం మార్చుతున్న టిడిపి

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై టిడిపి వ్యూహం మార్చాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం అమలైతే రాజకీయంగా వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే టిడిపి వేసే ఎత్తులకు వైసీపీ ఏ రకంగా వ్యూహన్ని మారుస్తోందోనన్న ఆసక్తి కూడ నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న ఘటనలను టిడిపి ప్రస్తావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగ్యానాయక్ ను నక్సలైట్లు కాల్చి చంపారు. అయితే ఆనాడు సిఎల్పీ నాయకుడిగా ఉన్న వైఎస్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని కోరారు. దీనికి ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి సరైనంది. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని స్థానాల్లో పోటీలు జరిగాయి. అయితే నంద్యాల స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వైసీపీని అసెంబ్లీలో కోరాలని టిడిపి నిర్ణయించింది. అయితే ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని ప్రకటించింది.అయితే ఈ విషయమై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతోందో చూడాలి.

గెలుపు నల్లేరుపై నడకే

గెలుపు నల్లేరుపై నడకే

నంద్యాల అసెంబ్లీ స్థానంలో గెలుపు నల్లేరుపై నడకేనని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. రెండు రోజుల క్రితం మంత్రులు కెఇ కృష్ణమూర్తి, నారాయణ, కాలువ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియతో కలిసి ఆయన నంద్యాల అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం రచించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఏకగ్రీవంగా ఈ ఎన్నిక జరగకపోయినా కానీ, ఎన్నికలు జరిగినా విజయం సాధించేలా వ్యూహన్ని రూపొందించారు. ఇప్పటికే వైసీపీలో అసంతృప్తితొ ఉన్న నేతలతో ఆ పార్టీ నాయకత్వం చర్చిస్తోంది.

English summary
I will win in Nandyala by elections said former minister Silpa Mohan reddy on wednesday. Tdp changed its stratagy for Nandyala by elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X