టిడిపిలోనే, రాజకీయాలతో బంధుత్వానికి సంబంధం లేదు: శిల్పాచక్రపాణిరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల:రాజకీయాలు వేరు, బంధుత్వం వేరని టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.తన సోదరుడు టిడిపిని వీడి వైసీపీలో చేరినా తాను మాత్రం టిడిపిలో ఉండనని చెప్పారు.

పోలిటికల్ గేమ్: నష్టం లేదు, నంద్యాలకు చంద్రబాబు, చక్రంతిప్పుతున్న అఖిలప్రియ

నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాన్చివేత ధోరణిని నిరసిస్తూ టిడిపిని వీడి శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారు. అయితే తాను మాత్రం టిడిపిని వీడబోనని శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు.

బాబుకు రివర్స్: గంగుల బాటలోనే శిల్పా, కారణమిదే, భూమా వల్లే వారిద్దరూ టిడిపికి గుడ్ బై

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలే తనకు శిరోధార్యమన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి. ఎవరు పార్టీని వీడినా తాను మాత్రం టిడిపిని వీడబోనని చెప్పారు.ప్రస్తుతం తాను కేరళలో ఉన్నట్టు చెప్పారు. తనతో కనీసం మాటమాత్రం చెప్పకుండానే మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకొన్నారని చెప్పారు.

పార్టీని వీడను

పార్టీని వీడను

తన సోదరుడు టిడిపిని వీడినా తాను మాత్రం టిడిపిలోనే కొనసాగుతానని టిడిపి కర్నూల్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. పార్టీ మారే విషయాన్ని శిల్పామోహన్ రెడ్డి తనతో కనీసం చెప్పలేదన్నారు. శిల్పాచక్రపాణిరెడ్డిని మండలి చైర్మెన్ గా చేయాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ప్రస్తుతం మండలి ఛైర్మెన్ గా చక్రపాణిరెడ్డి పదవీకాలం ముగియగానే ఆ స్థానంలో చక్రపాణిరెడ్డికి ఆ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నట్టు పార్టీవర్గాల్లో ప్రచారంలో ఉంది.

అన్నదమ్ములు ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో

అన్నదమ్ములు ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో

గతంలో కూడ వీరిద్దరూ సోదరులు వేర్వేరు పార్టీల్లో కొనసాగారు. శిల్పామోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగా కూడ పనిచేశారు. అయితే ఆ సమయంలో శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో ఉన్నారు. అయితే వైసీపీలో కడప జిల్లా ఇన్ చార్జీగా కూడ పనిచేశారు. అయితే వైసీపీలో ఆయనకు తగిన ప్రాధాన్యత లేదనే కారణంగా ఆయన పార్టీని వీడి టిడిపిలో చేరారు.ఆనాటినుండి ఆయన టిడిపిలోనే కొనసాగుతున్నారు.అయితే 2014 ఎన్నికలకు ముందు శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. ఆ సమయానికి చక్రపాణిరెడ్డి టిడిపిలోనే ఉన్నారు.దాదాపుగా మూడేళ్ళపాటు ఇద్దరూ కూడ టిడిపిలోనే కొనసాగారు. అయితే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు దక్కదనే కారణంతో శిల్పామోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరుతున్నారు.

చక్రపాణిరెడ్డి గెలుపుకోసం పనిచేసిన భూమానాగిరెడ్డి

చక్రపాణిరెడ్డి గెలుపుకోసం పనిచేసిన భూమానాగిరెడ్డి

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం కోసం భూమా నాగిరెడ్డి తీవ్రంగా కృషి చేశారు. తన అనుచరులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపుకోసం కృషిచేస్తున్నట్టు బాబు వద్ద భూమా నాగిరెడ్డి చెప్పారు. బాబుతో సమావేశమైన మరునాడే భూమా నాగిరెడ్డి మరణించాడు.అంతేకాదు ఈ రెండు కుటుంబాల మద్య ఉన్న విబేధాలను మరిచి శిల్పా కుటుంబంలో జరిగిన వివాహ కార్యక్రమానికి కూడ భూమా హజరయ్యారు.

నంద్యాలలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తా

నంద్యాలలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తా

నంద్యాలలో పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేయాలని పార్టీ ఆదేశిస్తే తాను నంద్యాలలో పనిచేసేందుకు సిద్దమేనని శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. పార్టీ ఏ ఆదేశాలను ఇచ్చినా తాను ఆ ఆదేశాలను పాటిస్తానని చక్రపాణిరెడ్డి ప్రకటించారు. శిల్పా మోహన్ రెడ్డిని పార్టీని వీడకుండా నాయకత్వం చర్యలు తీసుకొన్నా ఫలితం లేకుండాపోయింది. చక్రపాణిరెడ్డితో కలిసి నెలరోజుల క్రితం మోహన్ రెడ్డి అమరావతిలో బాబును కలిశారు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని బాబు... శిల్పామోహన్ రెడ్డికి సూచించారు.అయితే తన రాజకీయ భవితవ్యం దృష్ట్యా పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకొన్నట్టుగా మోహన్ రెడ్డి ప్రకటించారు.

రాజకీయాలు వేరు. బంధుత్వాలు వేరనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీలో తనకు సముచిత గౌరవం ఉందన్నారు చక్రపాణిరెడ్డి. ఆయన కర్నూల్ జిల్లాకు చెందిన మీడియా ప్రతినిధులతో ఫోన్ లో మాట్లాడారు.

English summary
Iam continue in Tdp said Silpa Chakrapani Reddy on Tuesday. He spoke with Kurnool media over phone from Kerala.I obey the party orders he said.
Please Wait while comments are loading...