వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్: మోడీ వద్ద వెంకయ్య మాట చెల్లట్లేదా, చక్రం తిప్పుతున్నదెవరు?

నవ్యాంధ్రలో పొత్తుల విషయంలో కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు మాటలు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాల వద్ద చెల్లుబాటు కావడం లేదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్రలో పొత్తుల విషయంలో కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు మాటలు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాల వద్ద చెల్లుబాటు కావడం లేదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

వెంకయ్యకు ప్రధాని మోడీ వద్ద మంచి పేరు ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వెంకయ్య ప్రధానిని ఆకట్టుకున్నారు. కేంద్రమంత్రిగా, బీజేపీ జాతీయస్థాయి నేతగా ఆ ప్రాధాన్యత ఉంది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం మరోలా ఉందంటున్నారు.

చంద్రబాబుకు బిగ్ షాక్: మోడీతో లక్ష్మీపార్వతి భేటీ, దేనికి సంకేతం?చంద్రబాబుకు బిగ్ షాక్: మోడీతో లక్ష్మీపార్వతి భేటీ, దేనికి సంకేతం?

ఉత్తరాదిన బిజెపికి మంచి పట్టు ఉంది. దక్షిణాదిన ఎదిగేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. 2019 ఎన్నికల నాటికి తెలంగాణ, ఏపీలలో అధికార, ప్రతిపక్షాలకు ధీటుగా ఎదగాలని భావిస్తోంది.

తెలంగాణలో అధికార తెరాసతో ఎలాంటి పొత్తు లేదు. కాబట్టి పార్టీ ఎదగడం స్థానిక బిజెపి నాయకులపై ఆధారపడి ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టిడిపితో పొత్తు ఉండటంతో చిక్కులు వచ్చి పడ్డాయి.

పురంధేశ్వరి చక్రం తిప్పుతున్నారా? చంద్రబాబుపై గేరు మార్చిన బిజెపిపురంధేశ్వరి చక్రం తిప్పుతున్నారా? చంద్రబాబుపై గేరు మార్చిన బిజెపి

పైగా, చంద్రబాబు, వెంకయ్యలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే 2014కు ముందు పొత్తు, ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేతల మధ్య విమర్శలు, విభేదాలు ఉన్నప్పటికీ ఆ మిత్రుత్వం కొనసాగుతోందని అంటున్నారు.

మారుతున్న పరిణామాలు

మారుతున్న పరిణామాలు

అయితే, ఇటీవలి పరిణామాలు మారుతున్నాయి. బిజెపికి వైయస్సార్ కాంగ్రెస్ దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. టిడిపి - బిజెపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరి మాటల తీరు చూస్తుంటే 2019 నాటికి ఈ పార్టీల వేర్వేరుగా పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు.

Recommended Video

Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu
వెంకయ్యకు తెలియకుండా..

వెంకయ్యకు తెలియకుండా..

2019లో పొత్తుతో వెళ్లాలనుకుంటే టిడిపితోనే వెళ్లాలని భావిస్తారు వెంకయ్య. కానీ ఏపీలో పొత్తు పరిణామాలు మాత్రం మలుపు తిరుగుతున్నాయి. జగన్ - ప్రధాని మోడీ భేటీ, ఇటీవల లక్ష్మీపార్వతి భేటీ అందరిలోను చర్చకు దారి తీస్తోంది. మోడీతో లక్ష్మీపార్వతి భేటీ విషయం వెంకయ్యకు తెలిస్తే అది టిడిపి అధినేతకు చెప్పేవారని, ఆయన అప్రమత్తమయ్యే వారని అంటున్నారు. కాబట్టి ఈ భేటీ వెంకయ్యకు కూడా తెలియకుండా జరిగి ఉండవచ్చునని అంటున్నారు.

జాతీయస్థాయిలో వెంకయ్య ఓకే.. రాష్ట్రానికి వస్తే..

జాతీయస్థాయిలో వెంకయ్య ఓకే.. రాష్ట్రానికి వస్తే..

జాతీయస్థాయిలో వెంకయ్య నాయుడి పాత్ర విషయంలో బిజెపి పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉంది. అలా అని ఏపీలో ఆయన మాట విని పార్టీ ఎదుగుదలను ఇక్కడితే ఆపేందుకు మొగ్గు చూపరు కదా అంటున్నారు. అందుకే ఏపీ విషయంలో... అదీ కేవలం పార్టీ ఎదుగుదల లేదా పొత్తు విషయంలో వెంకయ్య కాకుండా రాష్ట్రానికి చెందిన ఇతర నేతలు కూడా ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే విపక్ష నేతలకు అపాయింటుమెంట్ దొరుకుతోందని అంటున్నారు.

చంద్రబాబుతో ఉంటూ ధీటుగా...

చంద్రబాబుతో ఉంటూ ధీటుగా...

చంద్రబాబుతో కలిసి ఉంటే మనం ఎదగలేమని ఏపి బిజెపి నేతలు చాలామంది భావిస్తున్నారు. ఇదే విషయం అధిష్టానం దృష్టికి వారు తీసుకెళ్లారని తెలుస్తోంది. చంద్రబాబు - వెంకయ్యల దోస్తీ గురించి తెలిసి, ఏపీలో పార్టీ వ్యవహారాల విషయంలో మాత్రం ఢిల్లీ పెద్దలు ఇతరుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకొని ముందుకు వెళ్తున్నారని సమాచారం. మోడీతో లక్ష్మీపార్వతి భేటీ వెనుక, అలాగే వైసిపిని బిజెపికి దగ్గర చేయడం వెనుక పురంధేశ్వరి వంటి నేతలు చక్రం తిప్పుతున్నారని అంటున్నారు.

English summary
It is said that BJP leadership is avoiding Union Minister Venkaiah Naidu's some suggestions in Andhra Pradesh party issues. YSRCP leaders YS Jaganmohan Reddy and Laxmi Parvathi met PM Modi in recent days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X