వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీXతెలంగాణ: టీ-టీడీపీ నేతలను బాబు చిక్కుల్లో పడేస్తున్నారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలను చిక్కుల్లోకి నెడుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. విభజన నేపథ్యంలో ఇంకా సమస్యలు పూర్తిగా తీరలేదు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య దాదాపు ప్రతి అంశంలోను విభేదాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలకు ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పైన మండిపడుతోంది. అదే సమయంలో తెరాస నేతలు తెలంగాణ టీడీపీ నేతలను నిలదీస్తున్నారు.

Is Chandrababu troubling Telangana TDP leaders?

చంద్రబాబు లేదా ఏపీ టీడీపీ వ్యాఖ్యల పైన మీ స్పందన ఏమిటని నిలదీస్తున్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో విభజన విషయమై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విభజన సమస్యలు ఉన్నాయని, మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుందామంటే తెలంగాణ ప్రభుత్వం రాలేదని చెప్పారు. దీనిపై తెరాస నేతలు భగ్గుమన్నారు. ముఖ్యంగా హరీష్ రావు తెలంగాణ టీడీపీ నేతలను నిలదీశారు.

తెలంగాణ కోసం పోరాడింది టీడీపీనే అని తెలంగాణలో, రాష్ట్ర విభజన ఎమర్జెన్సీ కన్న ఘోరమని ఏపీలో చెబుతూ చంద్రబాబు పూటకో మాట చెబుతున్నారని హరీష్ రావు అన్నారు.

దీనిపై తెలంగాణ టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఇక్కడ సంబరాలు చేసుకుంటుంటే, అక్కడ విభజనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయాలని కలెక్టర్లు, అధికారులకు పిలుపునివ్వడం అవివేకమన్నారు. అవతరణ వేడుకలు జపురుకోవాలంటే టీడీపీ నేతలు ఆ పార్టీని వీడాలన్నారు.

English summary
Is Chandrababu troubling Telangana TDP leaders?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X