వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి భూదందా: పయ్యావుల సాక్షి స్టాఫ్‌తో కాళ్లబేరానికి దిగారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమరావతి భూకుంభకోణం విషయంలో తనకు సంబంధించిన వార్తాకథనాన్ని ప్రచురించకూడదని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ కాళ్లబేరానికి దిగారా? అవునని అన్నారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు.

తాను మగాడిలా భూమి కొన్నానని చెబుతున్న పయ్యావుల కేశవ్ బుధవారం రాత్రి 11 గంటల సమయంలో సాక్షి సిబ్బందితో కాళ్లబేరం నడిపిన మాట వాస్తవం కాదా అని అంబటి ప్రశ్నించారు. సాక్షి కార్యాలయం సెక్యూరిటీ సిబ్బంది నుంచి కంట్రిబ్యూటటర్ వరకు బతిమలాడి తనపై కథనం రాకుండా చేసేందుకు ప్రయత్నించలేదా అని పయ్యావులను ప్రశ్నించారు.

రాత్రి కాళ్ల బేరానికి వచ్చి పగలు మాత్రం జగన్‌పై సవాళ్లు విసరడం విచిత్రంగా ఉందన్నారు. సాక్షి సిబ్బంది దిగిరాకపోవడంతోనే ఆయన జగన్‌పై విరుచుకుపడినట్లు చెబుతున్నారు. జగన్‌కు దమ్ముంటే, మాగాడైతే ఇరువురి ఆస్తులపై చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరి తన కోపాన్నంతా ప్రదర్శించారని అంటున్నారు.

Is Payyavula Keshav appealed to sakshi daily staff

కేశవ్ సవాల్‌కు వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. పయ్యావుల కేశవ్ మగాడైతే, సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. పయ్యావుల కేశవ్ స్ధాయికి జగన్ అవసరంలేదని వైసీపీ కార్యకర్త చాలని అంబటి రాంబాబు అన్నారు. పయ్యావుల అంగీకరిస్తే ఉరవకొండలో చర్చకు వైసీపీ కార్యకర్తను పంపుతామన్నారు.

జగన్‌ గురించి మరిన్ని నిజాలు సీబీఐకి తెలియజేస్తా అని పయ్యావుల చెప్పడంపై స్పందిస్తూ... జగన్‌ అక్రమాలపై సాక్ష్యాలు ఉంటే ఇంతకాలం ఎందుకు సీబీఐకి సమర్పించలేదని ప్రశ్నించారు. ఇంతకాలం గాడిదలు కాశారా అని తీవ్ర వ్యాఖ్య చేశారు.

English summary
YSR Congress leader Ambati Rambabu made comments against Telugu Desam Party (TDP) leader Payyavula Keshav on Amaravati lands purchase issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X