వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ వచ్చినా: కోదండరాం అసహనం, కేసీఆర్ వ్యాఖ్యపై చర్చిస్తామని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ స్వయంపాలన స్వప్నం ఇంకా పూర్తిస్థాయిలో సాకారం కాలేదని, విభజన చిక్కుముళ్లను ఇంకా అధిగమించాల్సి ఉందని తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు.

టీఎన్జీవో భవన్లో ఐకాస విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. ప్రజలు చేసిన వీరోచిత పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని, అమరులను గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణానికి ఐకాస పోరాడుతుందన్నారు. టీజేఏసీ ఇకపై కేవలం ప్రజా సంఘంగా పని చేయాలని, తమ సమావేశాలకు రాజకీయ పార్టీలను ఆహ్వానించరాదని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలను జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించాలని తీర్మానించింది.

జేఏసీ

జేఏసీ

కోదండరాం అధ్యక్షతన స్టీరింగ్‌ కమిటీ విస్తృతస్థాయి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జేఏసీ

జేఏసీ

రాజకీయ పార్టీలను సమావేశాలకు, ఉత్సవాలకు పిలవడం లేదని ఇకపై టీజేఏసీ ప్రజాసంఘంగా మాత్రమే పని చేస్తుందని చెప్పారు.

జేఏసీ

జేఏసీ

ఉస్మానియా వర్సిటీ ఘటన పైన కూడా కోదండరామ్ స్పందించారు. ఉస్మానియా యూనివర్శిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న కేసీఆర్‌ ప్రకటన, దానిపై విద్యార్థుల నిరసన అంశాలను హైదరాబాద్‌ నగర జేఏసీలో చర్చించాక మాట్లాడుతామన్నారు.

 జేఏసీ

జేఏసీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ స్వయంపాలన స్వప్నం ఇంకా పూర్తిస్థాయిలో సాకారం కాలేదని, విభజన చిక్కుముళ్లను ఇంకా అధిగమించాల్సి ఉందని తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు.

English summary
JAC Meeting at TNGO
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X