వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ వ్యూహామే కరెక్ట్ అన్న ఆలోచనలో జగన్ : అంత తెగువ చూపించగలరా!! (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

విజయవాడ : తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా.. ఉద్యమ కాలంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాలనే ప్రస్తుతం జగన్ ఫాలో అవబోతున్నారా..! హోదాపై ప్రస్తుతం ఆయన వినిపిస్తోన్న వాదనలు చూస్తుంటే.. ప్రత్యేక హోదా సాధించడం కోసం ఒకింత కేసీఆర్ వైఖరిని ఒంటబట్టించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తోన్నట్టుగా స్పష్టమవుతోంది.

కేసీఆర్ అస్త్రంతో జగన్

కేసీఆర్ అస్త్రంతో జగన్


ఉద్యమ సమయంలో.. ఆందోళనలు, ప్రజా ధర్నాలతో పాటు కేసీఆర్ ఎక్కుపెట్టిన మరో ప్రధాన అస్త్రం ఉపఎన్నికలు. ఉపఎన్నికల ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మరుగునపడిపోకుండా.. ఆ ఆకాంక్షను జనంలో మరింత బలపడేలా చేయడానికి కేసీఆర్ ఉపఎన్నికలను ఉపయోగించుకున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. జగన్ కూడా ఇప్పుడిదే బాటలో నడవడానికి వ్యూహాలు సిద్దం చేసుకుంటుండడమే..!

 ఎక్కుపెట్టడానికి ఉపఎన్నిక అస్త్రం

ఎక్కుపెట్టడానికి ఉపఎన్నిక అస్త్రం

ప్రత్యేక హోదా సాధనపై బలంగా గొంతు వినిపిస్తోన్న ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్.. హోదా సాధన కోసం ఉపఎన్నికల అస్త్రాన్ని ఎక్కుపెట్టాలన్న అంశాన్ని మొన్నటి యువభేరీ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇదే గనుక జరిగితే.. హోదా అంశంతో ప్రజలను ఐక్యం చేసి అధికార టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడంతో పాటు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షం చేస్తున్న పోరాటాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలనేది జగన్ ఆలోచన అయి ఉండవచ్చు.

 టీడీపీని ఇరుకున పెట్టడానికి

టీడీపీని ఇరుకున పెట్టడానికి


అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత హోదా అంశంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ చేతులెత్తేయడంతో.. కేవలం ఎన్నికల సమయంలో పార్టీల పొలిటికల్ మైలేజ్ కోసమే హోదాను రాజకీయంగా వాడుకున్నాయన్న భావన ప్రజల్లో ఉన్నది. సరిగ్గా.. ఇదే అంశంపై ఫోకస్ చేసి అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఉపఎన్నికల అస్త్రం తమకు కలిసి వస్తుందనే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.

 హోదా అంశం మరుగునపడకుండా

హోదా అంశం మరుగునపడకుండా


ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తిగానే ఉంది. పైగా.. హోదా కంటే ప్యాకేజీని బెటర్ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. హోదా అంశాన్ని ఉనికిలో లేకుండా చేసే ప్రయత్నాలు కూడా మొదలైపోయాయి. ఇలాంటి సమయంలో.. హోదా అంశం మరుగునపడకుండా ఉండాలంటే ఉపఎన్నికలే సరైన అస్త్రం అని జగన్ భావిస్తుండవచ్చు.

 జగన్ అంత తెగువ చూపిస్తారా!

జగన్ అంత తెగువ చూపిస్తారా!

యువభేరీ సభలో ఉపఎన్నికలకు వెళ్లడానికైనా సరే సిద్దపడుతాం.. అంటూ వ్యాఖ్యలు చేసిన జగన్, దాన్ని ఎంతమేర ఆచరణలో పెడుతున్నారన్నదే ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తోన్న అంశం. మాటలకే పరిమితమై పోకుండా.. ఆనాడు కేసీఆర్ చూపించిన తెగువనే ఇప్పుడు జగన్ గనుక చూపిస్తే.. ప్రజల్లో హోదా ఆకాంక్ష పెల్లుబికడం ఖాయం. మరి జగన్ మాటలు తన ప్రసంగాలకే పరిమితమవుతాయా..? లేక భవిష్యత్తు వ్యూహాలుగా మారుతాయా అన్నది వేచి చూడాల్సిందే.

English summary
AP YSRCP President Jagan wants to follow Telangana CM KCR, as a moment leader of telangana kcr implimented few of the strategies very logically. Thats why jagan also interesting in them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X