వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టు నుంచి ఆంధ్రులు నేర్చుకోవాలి, నన్ను కదిలించారు: ఏపీ నేతలపై పవన్ డౌట్

జల్లికట్టు కోసం చేసిన ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాలని, అది ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి స్ఫూర్తి అని, తమిళుల ఉద్యమ స్ఫూర్తి తనను కదిలించిందని పవన్ కళ్యాణ్ శనివారం నాడు ట్వీట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జల్లికట్టు కోసం చేసిన ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాలని, అది ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి స్ఫూర్తి అని, తమిళుల ఉద్యమ స్ఫూర్తి తనను కదిలించిందని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు ట్వీట్ చేశారు.

జగన్‌పై అఖిల ప్రియ తీవ్ర ఆగ్రహం, 'మేం తలుచుకుంటే.. రోజా మాట్లాడరేం'జగన్‌పై అఖిల ప్రియ తీవ్ర ఆగ్రహం, 'మేం తలుచుకుంటే.. రోజా మాట్లాడరేం'

ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్ఫూర్తిదాయకం అన్నారు. జల్లికట్టు ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాలన్నారు. కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని చెప్పారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించకుంటే అతటా ఇలాంటి ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. తమిళుల పోరాట పటిమ ఈ ఉద్యమం ద్వారా ప్రతిబింబించిందన్నారు. కులమతాలకు అతీతంగా తమిళులు అంతా ఏకమై జల్లికట్టు కోసం నినదించటం స్ఫూర్తిదాయకం అన్నారు.

pawan kalyan

లక్షలాది మంది మెరీనా బీచ్ వద్దకు వచ్చి ఉద్యమించినా, నిరసనలు చేపట్టినా ఎక్కడా అసాంఘిక ఘటనలు చోటు చేసుకోలేదని, ఇది చాలా సంతోషకరమన్నారు. తమిళుల అహింసాయుద పద్ధతి, పోరాటం, సంఘటిత శక్తి తనను కదిలించాయన్నారు.

మన నేతలు కూడా ఇలాంటి సంఘీభావం ప్రదర్శించాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఉద్యమాన్ని, ఏపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఒకవేళ నేతలు రాజీపడ్డా ప్రజలు రాజీపడరనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

నిన్న పవన్... నేడు జగన్‌కు 'మెగా' షాక్: దాసరిని చిరంజీవి అడ్డుకుంటున్నారా!?నిన్న పవన్... నేడు జగన్‌కు 'మెగా' షాక్: దాసరిని చిరంజీవి అడ్డుకుంటున్నారా!?

జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఏపీకి హోదా సాధించాలన్నారు. అయితే, వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉండి రాజకీయ నిబద్దత తక్కువగా ఉన్న మన రాజకీయ నేతలు తమిళ ఉద్యమం నుంచి ఎంత వరకు స్ఫూర్తి పొందుతారనే దాని పైన తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. నేతలు రాజీపడినా, ప్రజలు రాజీపడరని తన నమ్మకం అన్నారు. చివర్లో జైహింద్ అని రాశారు. తెలుగులో, ఇంగ్లీషులో ట్వీట్ చేశారు.

English summary
Jana Sena chief Pawan Kalyan on Satur day said that Jallikattu protest is inspiration for Andhra people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X