వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రిగోల్డ్ ఓ చిక్కుముడి, ఒత్తిళ్లు ఉన్నాయా, ఆస్తులెన్ని: బాబుకు పవన్ కల్యాణ్

అగ్రిగోల్డ్ సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి ప్రభుత్వంపై గురువారం ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఆయన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులను కలిశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: అగ్రిగోల్డ్ సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి ప్రభుత్వంపై గురువారం ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఆయన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులను కలిశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

అగ్రిగోల్డ్‌కు వేలకోట్ల ఆశ్తులు ఉన్నాయని చెప్పారు. అయినా బాధితులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ అంశంలో రకరకాల అభియోగాలు ఉన్నాయని, కొందరు ఒత్తిడి చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు.

pawan kalyan

ఉద్ధానానికి, అగ్రిగోల్డ్ అంశానికి సంబంధం లేదన్నారు. ఇదో చిక్కుముడి లాంటిది అని చెప్పారు. డెడ్ లైన్‌లతో దీనిని పరిష్కరించాలనుకోవడం కుదరదని చెప్పారు. బాధితులు ఆత్మహత్య చేసుకోవడం ఆపాలన్నారు.

అగ్రిగోల్డ్ ఆస్తులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, అలా చేస్తుందో లేదో తెలియదని చెప్పారు. అసెంబ్లీలో చర్చకు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వంతో మాట్లాడే అంశం బాధితులతో మాట్లాడాక చెబుతానని అన్నారు. శారదా స్కాంలో బాధితులకు రూ.5వేలు ఇచ్చారన్నారు.

చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేయట్లేదు కానీ..

కేసు కోర్టు పరిధిలో ఉందని, తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించే దిశగా చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని భావించాల్సిన అవసరం లేదని, అయితే డబ్బు తిరిగి చెల్లింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు.

అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం ముందడుకు వేయకపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ విషయంలో న్యాయవాదుల అభిప్రాయాలను తీసుకుంటానని చెప్పారు.

English summary
Jana Sena chief Pawan Kalyan on Thursday has questined TDP government over Agri Gold issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X