వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ సెషన్స్ తర్వాత ఉద్యోగాల జాతర: మంత్రి ఈటెల

|
Google Oneindia TeluguNews

వరంగల్: శాసనసభ బడ్జెట్ సమావేశాల తర్వాత విద్యార్థుల కోసం ఉద్యోగాల జాతర ప్రారంభమవుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వరంగల్ లాల్ బహదూర్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మచ్చలేని ప్రభుత్వంగా దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

బడ్జెట్ సమావేశాల అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థుల కోసం ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు సిఎం కెసిఆర్ అంగీకరించినట్లు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా ఎయిడెడ్ ప్రభుత్వ కళాశాలల్లో పని చేసే పార్ట్ టైం ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.

Jobs notification will release after budget session, says Etela

15 రోజుల్లో 2013-14 ఫీజు బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన ప్రతీ విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న కళాశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.
కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ విజయేందర్ రెడ్డి, కార్యదర్శి బి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ డా. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఇసుక మాఫియాతో మంత్రులు, ఎమ్మెల్యేల కుమ్మక్కు: కిషన్‌ రెడ్డి

మహబూబ్‌నగర్: ఇసుక మాఫియాతో.. మంత్రులు, ఎమ్మెల్యేల కుమ్మక్కయ్యారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. పత్రికల్లో కథనాలు వచ్చిప్పుడు మాత్రమే.. మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

ఇసుక మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్‌ చేశారు. కరువును గుర్తించడంలో ప్రభుత్వం వెనకడుగు వేసిందని అన్నారు. త్రిశంకుస్వర్గంలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం ఉందని, పాలమూరులోని ప్రాజెక్టులను జూన్‌లోగా పూర్తి చేయాలి కిషన్‌రెడ్డి అన్నారు.

English summary
Telangana minister Etela Rajender on Friday said that jobs notification will release after budget session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X