వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి రహస్యంగానా?: ‘నవ భారత్ పార్టీ’పై జూ. ఎన్టీఆర్ తేల్చేశారు

|
Google Oneindia TeluguNews

అమరావతి: 'నవ భారత్ నేషనల్ పార్టీ' విషయంపై ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌ను 'నవ భారత్ నేషనల్ పార్టీ'కి ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నామంటూ ఇటీవల ఓ లేఖ నెట్‌లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకుని ఓ చిరునవ్వు నవ్వేశాడట.

జూ.ఎన్టీఆర్ ఈ పార్టీ ఏపీ అధ్యక్షుడు అంటూ ప్రచారంజూ.ఎన్టీఆర్ ఈ పార్టీ ఏపీ అధ్యక్షుడు అంటూ ప్రచారం

పట్టించుకోవద్దు

పట్టించుకోవద్దు

తాను ఇటువంటి వార్తలను పట్టించుకోబోనని వారికి చెప్పాడట జూ. ఎన్టీఆర్. అంతేగాకుండా ఎవరూ ఈ వార్తలను పట్టించుకోవద్దని, వదిలేయాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదేనని స్పష్టం చేశారట.

జోరుగా ప్రచారం

జోరుగా ప్రచారం

జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పేరు నవభారత్ నేషనల్ పార్టీ అని, ఆయన ఏపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా నియమించబడ్డారని.. సోషల్ మీడియాలోను ప్రచారం సాగుతోంది.
ఎన్టీఆర్‌ను అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొంటు ఆయనకు రాసినట్లు లెటర్ హెడ్ ఉంది. అందులో.. టు నందమూరి తారక రామారావు, తండ్రి పేరు హరికృష్ణ, వయస్సు 33, వృత్తిపరంగా నటుడు అని పేర్కొంటూ జూబ్లీహిల్స్ అడ్రస్ ఇచ్చారు.

అధికారికంగా ప్రకటిస్తా..

అధికారికంగా ప్రకటిస్తా..

కాగా, తనకు ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమేమీ లేదని, ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే తానే స్వయంగా బహిరంగ ప్రకటన చేస్తానని అతడిని కలిసిన అభిమానులకు వివరించారట జూనియర్ ఎన్టీఆర్.

రహస్యంగా రాజకీయాల్లోకా..?

రహస్యంగా రాజకీయాల్లోకా..?

వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రహస్యంగా రాజకీయాల్లోకి వచ్చే అవసరం తనకు లేదని జూ. ఎన్టీఆర్ వారితో వ్యాఖ్యానించారట. మొత్తానికి తనపై వస్తున్న రాజకీయ ప్రచారానికి అభిమానులతో తారక్ ఇలా చెక్ పెట్టారని ఫిల్మ్‌నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ప్రస్తుతం ‘జైలవకుశ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది.

English summary
Recently, rumours started swirling that Jr NTR was going to start a new political party. A few persons created some fake papers and circulated them on social media, which went viral. The papers even announced that he would be the President of the Nava Bharat National Party for the state of Andhra Pradesh. And while some of the web and electronic media highlighted these rumours, Jr NTR remained unfazed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X