వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలకు 50 లక్షలు, కోటి ఇచ్చారు: జగన్‌పై దండెత్తిన జ్యోతుల

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ/ విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన శాసనసభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై జ్యోతుల నెహ్రూ దండెత్తారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు వేయించడానికి రూ.50లక్షలు, కోట్లిచ్చారని ఆయన ఆరోపించారు.

వ్యక్తిత్వాన్ని సరిగ్గా బేరీజు చేసుకోకుండా తన వ్యక్తిత్వాన్నంతటిని గుడ్డితనంతోటి జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఒక నూతన రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భావిస్తోంది..పార్టీ బలోపితానికి, అందులో నేత యువకుడే గనుక అతనితో చేయికలిపి నడిస్తే ఒక మంచిపార్టీని ప్రజలకు అందివ్వగలుగుతామన్న అంచనాతో తాము జగన్ వద్దకు వెళ్లామే తప్ప పదవులకు ఆశపడి రాలేదని ఆయన అన్నారు.

 Jyothula Nehru makes comments against YS Jagan

జగన్ విషయంలో తమ అంచనా తప్పిందని అన్నారు. రూపాయిలకు ప్రలోభపడి ఎవ్వరూ పార్టీ మారలేదని ఆయన స్పష్టం చేశారు. అలా రూపాయిలకు ప్రలోభపడినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు. తన వ్యక్తిత్వాన్ని కొనడానికి ఎవ్వరూ సరిపోరని ఆయన అన్నారు. అలా అనుకుంటే జగన్ గతంలో ఎంతిచ్చి ఎమ్మెల్యేలను కొన్నారని ఆయన ప్రశ్నించారు.

జగన్ రాజకీయం పరంగా చాలా దిగజారిపోయారని, ఆఖరికి రాజ్యసభకు వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర ఓటు వేయించడానికి 50లక్షలు, కోట్లిచ్చారని ఆయన న్నారు. డబ్బులిచ్చినట్టు తన దగ్గర సాక్ష్యాలున్నాయన్నాయన్నారు. ఓట్లు వేయించుకోవడానికి నిలుపుదల చేసుకునే నికృష్ట స్థితిలో జగన్ ఉన్నారంటే వైసిపి శాసన సభ్యులు ఆయన మీద ఎంత నమ్మకంతో ఉన్నారో ఒక్కసారి అర్ధం చేసుకోవాలని జగన్‌‌కు జ్యోతుల నెహ్రూ సూచించారు.

వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి ఎంతమంది వచ్చారో జగన్‌ లెక్క చెప్పాలని మరో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 67 సీట్లు కూడా రావని జలీల్ జోస్యం చెప్పారు. జగన్‌ వ్యవహారం నచ్చకే పార్టీనుంచి బయటకు వచ్చామని ఆయన మరోసారి చెప్పారు.

English summary
The deffected YSR Congress MLA Jyothula Nehru has made comments against the TSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X