వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్లకార్డు పట్టుకున్నారు, బాబు సింగపూర్‌కు తాకట్టు: జ్యోతుల నెహ్రూ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్లకార్డు పట్టుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ గుర్తు చేశారు. సింగపూర్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆయన శుక్రవారం ఆరోపించారు.

చంద్రబాబు ప్రభుత్వం చేసేది నదుల అనుసంధానం కాదని, నిధుల అనుసంధానమని ఆయన అన్నారు. కేంద్రం నిధులను ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం వడ్డీవ్యాపారిలా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని లాంటిదని ఆయన అన్నారు.

Jyothula Nehru says Jagan's fast is for special status

ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందిచాలని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ నిరవదిక దీక్షకు మద్దతుగా శుక్రవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆయన నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదాపై చంద్రబాబు వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రానికి టిడిపి మద్దతు ఉపసంహరించుకోవాలని ఆయన అ్నారు. ఎస్కేయూలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విద్యార్థి విభాగం నేతలు సిఎం చంద్రబాబు శవయాత్ర నిర్వహించారు.

English summary
YSR Congress party leader jyothula Nehru said that Chandrababu should react on special status to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X