హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను సినిమాల్లో హీరో, గౌతమి రియల్ హీరో: కమల్ హాసన్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను రెండు వందలకు పైగా సినిమాల్లో హీరోగా చేసి ఉండవచ్చునని కానీ, నిజ జీవితంలో మాత్రం అసలైన హీరో గౌతమి అని సినీ నటుడు కమల్ హాసన్ శనివారం అన్నారు.

హైదరాబాదులో యశోదా అంతర్జాతీయ కేన్సర్ సదస్సును ప్రారంభించేందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, గౌతమి, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఉప ముఖ్యమంత్రి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

కేన్సర్ బారిన పడి మా స్నేహితులు, బంధువులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కానీ కేన్సర్ విన్నర్ అయిన గౌతమిని నేను పొందానని, కేన్సర్ రోగులకు మాత్రమే కాకుండా, తనకు కూడా ఆమె ఎంతో స్ఫూర్తి అని కమల్ చెప్పారు.

 కేన్సర్

కేన్సర్

బోన్‌మారో ట్రాన్సుప్లాంట్ ప్రక్రియలో సిద్దఙస్తులైన డాక్టర్ యమ్మెన్ చాంద్‌ను ఉద్దేశించి.. చాంద్ లాంటి డాక్టర్లు ఉంటే మన దేశం ఆరోగ్యపరంగా మొదటి స్థానంలో నిలుస్తుందని కమల్ హాసన్ చెప్పారు.

 కేన్సర్

కేన్సర్

ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలోనే ఆయన బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం, భారతీయ నైపుణ్యంతో రూపొందించడం సంతోషమన్నారు.

 కేన్సర్

కేన్సర్

గౌతమి మాట్లాడుతూ.. కేన్సర్ అనేది అతిభయంకరమైన రోగంగా ముద్రపడిందని, ప్రతి ఒక్కరి జీవితం కేన్సర్‌తో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానే ముడివడి ఉందన్నారు.

 కేన్సర్

కేన్సర్

నాకు కేన్సర్ సోకి కీమోథెరపీ చేయించుకున్నప్పుడు జుట్టంతా పోయిందని, నాలో ఆత్మవిశ్వాసం మాత్రం పోలేదని, కేన్సర్ చికిత్సకు లొంగనిది కాదని గౌతమి చెప్పారు.

 కేన్సర్

కేన్సర్

ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, గౌతమి, కేటీ రామారావు, రాజయ్యలతో పాటు యశోదా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు, బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రక్రియలో సిద్ధహస్తులైన డాక్టర్ యమ్మెన్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Kamal Hassan, Gautami narrate cancer struggle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X