వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు: కాపు లీడర్, టీడీపీకి హరి కౌంటర్

|
Google Oneindia TeluguNews

చిత్తూరు/విశాఖ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కాపు కార్పోరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి కలిశారు. తిరుమలలో అతనిని మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సన్మానించారు.

నిన్న చిరంజీవికి తగ్గారు, నేడు పవన్‌కళ్యాణ్‌కి చేదు

ఈ సందర్భంగా జరిగిన భేటీలో ఆసక్తికర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, బలిజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను పవన్ కళ్యాణ్‌కు మురళి వివరించారు. విద్యార్థులకు విదేశీ విద్య, సివిల్స్‌కు ఉచిత శిక్షణ, నిరుద్యోగులకు రుణాలు వంటి వాటి గురించి తెలిపారు.

ఆయన చెబుతున్న వాటిని పవన్ కళ్యాణ్ ఆసక్తిగా విన్నారని తెలుస్తోంది. కాపులకు చంద్రబాబు సర్కారు అందిస్తున్న ప్రోత్సాహకాలను పవన్ మెచ్చుకున్నారని మురళీ ఆ తర్వాత తెలిపారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు.

Kapu director meets Pawan Kalyan

హోదాపై చర్చ జరుగుతోంది: హరిబాబు

ప్రత్యేక హోదా పైన ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని విశాఖ ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షులు హరిబాబు శుక్రవారం అన్నారు. ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో చర్చిస్తున్నారని తెలిపారు. నివేదికతో సంబంధం లేకుండా విశాఖకు రైల్వేజోన్ ఇవ్వాలన్నారు.

చంపుకోవడమా.. వదలొద్దు, ప్రభుత్వం విఫలమైతే చూద్దాం: పవన్ కళ్యాణ్

చంద్రబాబు కృషి చేస్తే గడువులోగా పోలవరం పూర్తవుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం పైన విమర్శలు రావడంపై స్పందిస్తూ.. కేంద్రం సాయం ఇదే చివరిది కాదన్నారు. ఏపీకి రెవెన్యూ లోటు ఎంతివ్వాలనేది నిర్ధారణ కాలేదన్నారు.

కేంద్రం నుంచి ఇటీవల వచ్చిన రూ.1976 కోట్ల పైన ఏపీ సీఎం చంద్రబాబు సహా టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం చేసే సాయం ఇదే చివరిది కాదని ఇప్పుడు హరిబాబు కౌంటర్ ఇచ్చారు. రెవెన్యూ లోటు పైన చర్చిస్తున్నట్లు తెలిపారు.

English summary
Kapu director Murali met Jana Sena party chief Pawan Kalyan and discussed about government schemes to Kapus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X