వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రోజా అగ్రవర్ణ దురహంకారం, అనిత దళిత ఎమ్మెల్యే కాబట్టే.. సారీ చెప్పు'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా దళిత ఎమ్మెల్యే, టిడిపి నేత వంగలపూడి అనితకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ బుధవారం డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా దళిత ఎమ్మెల్యే, టిడిపి నేత వంగలపూడి అనితకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ బుధవారం డిమాండ్ చేశారు.

శివాజీ అధ్యక్షతన దళిత సంఘాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపి ఎమ్మెల్యే అనితకు రోజా క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. అనిత దళిత మహిళ కాబట్టే రోజా క్షమాపణ చెప్పడం లేదని వ్యాఖ్యానించారు.

<strong>రోజా శిక్ష పూర్తయింది: 'కోర్టు' స్టోరీ చెప్పిన జగన్, చంద్రబాబుకు హెచ్చరిక</strong>రోజా శిక్ష పూర్తయింది: 'కోర్టు' స్టోరీ చెప్పిన జగన్, చంద్రబాబుకు హెచ్చరిక

Karem Sivaji demands for Roja apology to Anitha

అగ్రవర్ణ దురహంకారానికి రోజా నిదర్శనం అన్నారు. రోజా వ్యవహార శైలికి నిరసనగా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. రోజాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కలుస్తామన్నారు. జగన్ కూడా రోజాను వైసిపి నుంచి సస్పెండ్ చేసి, దళితుల మనోభావాలను గౌరవించాలన్నారు.

చంద్రబాబుకు డొక్కా థ్యాంక్స్

ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు, లోకేష్‌కు టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య రావు థ్యాంక్స్ చెప్పారు. తనకు ఇది రాజకీయ పునర్జన్మ అన్నారు. టిడిపి పటిష్టతకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. తనకు, జూపూడి, కారెం శివాజీలకు సముచిత స్థానం ఇచ్చి దళితులను టిడిపి ప్రోత్సహిస్తోందన్నారు. టిడిపి ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందన్నారు.

English summary
Karem Sivaji demanded for YSR Congress Party MLA Roja apology to TDP MLA Vangalapudi Anitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X