చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనురాధ దంపతుల హత్య: చింటూ బహిరంగ లేఖ, డిజిపి ఏమన్నారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వారి మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ బహిరంగ లేఖ రాశాడు. తనకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని అతను ఆ లేఖలో చెప్పాడు. తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారుడు

కటారి దంపతుల హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. తాను అమాయకుడినని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చింటూ చెప్పాడు. ఇదిలా ఉంటే, కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ విదేశాలకు వెళ్లే అవకాశం లేదని డిజిపి జెవి రాముడు అన్నారు.

Chintoo

మేయర్ దంపతుల హత్య కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు పురోగతిపై ఆయన శనివారం చిత్తూరులో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయినవారి వివరాలను ఆయన ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమీక్షా సమావేశానికి ఐడి ఆర్పీ ఠాగూర్‌తో పాటు జిల్లా ఎస్పీ జి. శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మేయర్ అనురాధ దంపతుల హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

English summary
The main suspect in Chittoor mayor couple murder case, Chandrasekhar alias Chintoo has written an open letter saying his prepardness to surrender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X