వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు ఫోన్ చేసి కేసీఆర్ గ్రీటింగ్స్, బాలకృష్ణ ఇంట్లో కేక్ కట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు చంద్రబాబు పుట్టిన రోజు. ఆయన ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, గతంలో కేసీఆర్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరికి కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల పక్షాన నిలిచే బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీలో సీపీఎం నిర్మాణాత్మకంగా ఉండాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు.

KCR calls up Chandrababu and conveys Birthday greetings

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 66వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్‌ నరసింహన్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం బాబుకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు.

బాలకృష్ణ నివాసంలో కేక్‌కట్‌ చేసిన చంద్రబాబు

పుట్టినరోజు సందర్భంగా వియ్యంకుడు బాలకృష్ణ నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సీఎం చంద్రబాబు కేక్‌ కట్‌ చేశారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌కు చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అయితే ట్రస్ట్‌భవన్‌లో చంద్రబాబు కొద్దిసేపే ఉండటంతో శుభాకాంక్షలు చెప్పే అవకాశం దొరక్క కొందరు కార్యకర్తలు నిరాశతో వెనుదిరిగారు.

English summary
KCR calls up Chandrababu and conveys Birthday greetings
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X