తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు రాష్ట్రాలు గొప్పగా, శ్రీవారికి ప్రాంతాలుండవు: తిరుమలలో కేసీఆర్(పిక్చర్స్)

తిరుమల శ్రీవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మొక్కులు సమర్పించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని .

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల శ్రీవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మొక్కులు సమర్పించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు, అధికారులు బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.

'శంకర్ ఎలా ఉన్నావ్': రేణిగుంటలో బాల్యమిత్రుడితో కేసీఆర్ ఆసక్తికరం'శంకర్ ఎలా ఉన్నావ్': రేణిగుంటలో బాల్యమిత్రుడితో కేసీఆర్ ఆసక్తికరం

దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఛైర్మన్, అధికారులు తమ కుటుంబసభ్యులు, మంత్రులు, అధికారులకు శ్రీవారం దర్శనం బాగా చేయించారని చెప్పారు. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, సంతోషమని శుభాకాంక్షలు తెలిపారు.

<strong>తిరుమలలో కేసీఆర్‌కు ఘన స్వాగతం, కొండపై కలిసిన వైసిపి నేతలు</strong>తిరుమలలో కేసీఆర్‌కు ఘన స్వాగతం, కొండపై కలిసిన వైసిపి నేతలు

రెండు రాష్ట్రాల ప్రజలను శ్రీవారు చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల మధ్య అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.

ఇరు రాష్ట్రాలు కలిసే ముందుకు సాగుతాయని అన్నారు.

హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించగా.. శ్రీవారికి ప్రాంతాలుండవని, శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని చెప్పారు.
ధర్మ ప్రచారానికి టీటీడీతో కలిసి ముందుకు సాగుతామని కేసీఆర్ తెలిపారు.

ఘన స్వాగతం: శ్రీవారి దర్శనం

ఘన స్వాగతం: శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కుటుంబ సభ్యులు, తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వకుళామాతను, శ్రీ విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు.

శ్రీవారిని దర్శించుకున్న వారిలో..

శ్రీవారిని దర్శించుకున్న వారిలో..

స్వామి వారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ స్పీకర్‌ మధుసూదనాచారి, మంతులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ కవిత ఉన్నారు. ఏపీ ప్రతినిధిగా రాష్ట్రమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కేసీఆర్‌ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆభరణాల సమర్పణ

ఆభరణాల సమర్పణ

తిరుమల శ్రీవారికి కేసీఆర్‌ దంపతులు రూ.5కోట్లు విలువైన బంగారు అభరణాలను సమర్పించారు. 14.2కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65కిలోల బంగారు కంఠెను ఆయన సమర్పించారు.

వరాహ స్వామి సేవలో కేసీఆర్‌

వరాహ స్వామి సేవలో కేసీఆర్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయల్దేరారు. ఆయన ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత కుటుంబసమేతంగా వరాహస్వామిని దర్శించుకున్నారు. వాహన మండపం నుంచి బ్యాటరీ వాహనంలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, కేసీఆర్‌కు స్వాగతం పలికారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao couples and minister visited Tirumala Srivari temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X