వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మ విశ్వాసం ఎక్కువ, తల తెగినా అనుకున్నది సాధిస్తా: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్ : తెలంగాణ రాక ముందు తాను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణలోనే అడుగుపెడుతానని చెప్పానని, చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టానని, తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, తల తెగినా అనుకున్నది సాధిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో ఉందన్నారు. పెన్షన విషయంలో తీవ్రంగా ఆలోచించి ఆలనా పాలనా లేనివాళ్ల కోసమే రూ. వెయ్యి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. పెన్షన్లు రానివారు అధైర్య పడకుండా తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హునికి పెన్షన్లు ఇస్తామని ఉద్ఘాటించారు.

గత ప్రభుత్వాలు ఒక్కో కుటుంబానికి 20 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. బీడీ కార్మికుల సమస్యలు తనకు తెలుసునని, వారి ఇళ్లలో ఉండి తాను చదువుకున్నానని తెలిపారు. చెరుకు రైతుల బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. జగిత్యాల, మెట్‌పల్లిలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, పెన్షన్లు రాని వారికి సర్పంచ్‌లు సహకరించి వారి పేర్లు నమోదు చేయాలని సూచించారు.

మిషన్ కాకతీయ పేరిటి చెరువుల పూడికలు తీసి పూర్వ వైభవం తెస్తామని వెల్లడించారు. మీ ఊరి చెరువు నిండిత మీ ఊరి కడుపు నిండినట్టే అని తెలిపారు. 2017 నాటికి తెలంగాణ రైతాంగానికి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అందిస్తామన్నారు. 2018 నాటికి రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండవు అని స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శంగా ఉంది 2.3 వేల మెగావాట్ల విద్యుత్‌ను అవసరమైతే పక్క రాష్ర్టాలకు అందిస్తామని పేర్కొన్నారు.

KCR says he will achieve what he wants

వాటర్‌గ్రిడ్ ద్వారా 2019 లోపు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతీ చోట పరిశుభ్రమైన మంచినీరు అందిస్తామని ఉద్ఘాటించారు. ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సి ఉందని, పార్టీలకతీతంగా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. జగిత్యాలను జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రకటించారు.

కరీంనగర్ జిల్లాలోని రాయికల్‌లో కొమురంభీమ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రి ఓరమ్, చినజీయర్‌స్వామి, మంత్రి చందులాల్, ఎంపీ కవిత, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, విద్యాసాగర్‌రావు, శోభ, రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఆడిటోరియం, ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు.

ఈ నెల 3న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జైపూర్‌లో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

English summary
Telangana CM K chandrasekhar rao said in his Karimnagar district tour in Telangana state that he will achieve what he wants
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X