అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: రాజధానిపై కెఈ కృష్ణమూర్తి సంచలనం, పవన్ కళ్యాణ్ పైనా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూసేకరణ పైన ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కెఈ కృష్ణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ అవసరం లేదన్నారు.

భూసేకరణ అంశం తన శాఖ పరిధిలో లేదన్నారు. రాజధానికి అవసరమైన భూముల సేకరణ ప్రకటన జారీపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భూసేకరణ, సమీకరణ అంశాలపై పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ప్రకటనలపై తానేమీ వ్యాఖ్యానించనని చెప్పారు.

కెఈ కృష్ణమూర్తి

కెఈ కృష్ణమూర్తి

ఇటీవల ఇచ్చిన భూసేకరణ ప్రకటన ప్రభుత్వ వ్యవహారాల్లో భాగంగా జారీ అయినదేనని కెఈ కృష్ణమూర్తి ఈ సందర్భంగా చెప్పారు.

కెఈ కృష్ణమూర్తి

కెఈ కృష్ణమూర్తి

గ్రామకంఠాల నిబంధనల్లో సీఆర్డీఏ పరిధి వరకూ సవరణలు చేయబోతున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ ప్రభుత్వానికేమీ వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.

కెఈ కృష్ణమూర్తి

కెఈ కృష్ణమూర్తి

రైతులకు సానుకూలంగానే పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు చెప్పారని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన జగన్ వ్యాఖ్యల పైనా స్పందించారు.

 కెఈ కృష్ణమూర్తి

కెఈ కృష్ణమూర్తి

వైయస్ జగన్‌ ప్రకటనలు హాస్యాస్పదమని కేఈ కృష్ణమూర్తి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంత ప్యాకేజీ అడిగారో తెలియదుగానీ.. రాయలసీమ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు.

కెఈ కృష్ణమూర్తి

కెఈ కృష్ణమూర్తి

పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు సాగు నీటికొరత ఉండబోదన్నారు. సీమకు మంచి ప్యాకేజీ అవసరమని ఆయన చెప్పారు.

English summary
Deputy CM of AP KE Krishnamurthy once again made sensational comments on the land acquisition for AP Capital region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X