వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిపై కేశినేని సంచలన వ్యాఖ్యలు: మంత్రి ఉమాపై అసంతృప్తి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ఆరు నెలల పాలనపై ఆ పార్టీ పార్లమెంటుసభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక, ఏపి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎంపి కేశినేని నాని శుక్రవారం మాట్లాడుతూ.. టిడిపి ఆరునెలల పాలనలో బెజవాడకు చేసేందేమి లేదని అన్నారు. ఇప్పటికీ తమకు అధికారులకు మధ్య సమన్వయం ఏర్పడలేదని చెప్పారు. చాలా చోట్ల తమను అధికారులు పట్టించుకోవడట్లేదని అసహనం వ్యక్తం చేశారు.

Kesineni Nani unhappy with TDP and minister Uma

ఢిల్లీలో లేని నైట్ డామినేషన్.. విజయవాడలో అవసరమా? అని కేశినేని నాని ప్రశ్నించారు. అధికారులు మంత్రి ఉమాను సంప్రదిస్తే సరిపోదని.. ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా కలుపుకుని పోవాలని సూచించారు.
మమ్మల్ని సంప్రదించకుండా మంత్రి ఉమా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అందరూ కలిసి పని చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

కాగా, మంత్రులు నారాయణ, ఉమా సమక్షంలోనే కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేయడంతో మంత్రి ఉమా స్పందించారు. కేశినేని నాని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకుంటామని అన్నారు. విజయవాడ ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. విజయవాడ ప్రజల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

English summary
Telugudesam MP Kesineni Nani on Friday said that he is unhappy with TDP and minister Devineni Umamaheswar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X