విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొత్తు వల్లే: బీజేపీపై ఎంపీ కేశినేని నాని సంచలనం, మెజార్టీ రాలేదని..

గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా ఉంటే విజయవాడలో తెలుగుదేశం మరింత భారీ మెజార్టీతో గెలిచేదని ఎంపీ కేశినేని నాని ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా ఉంటే విజయవాడలో తెలుగుదేశం మరింత భారీ మెజార్టీతో గెలిచేదని ఎంపీ కేశినేని నాని ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ అర్బన్ టిడిపి కమిటీల ఎన్నిక సందర్భంగా మాట్లాడారు.

<strong>'బాబూ! వెంకయ్య ఏమన్నాడో తెలుసుగా', 'జగన్ లేఖపై మోడీ నిర్ణయం'</strong>'బాబూ! వెంకయ్య ఏమన్నాడో తెలుసుగా', 'జగన్ లేఖపై మోడీ నిర్ణయం'

బీజేపీ వల్ల ఓట్లు తగ్గాయి

బీజేపీ వల్ల ఓట్లు తగ్గాయి

2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్లే టిడిపికి ఓట్లు తగ్గాయని నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకున్నా నగరంలోని మూడు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయామన్నారు.

క్రాస్ ఓటింగ్ జరిగింది

క్రాస్ ఓటింగ్ జరిగింది

బీజేపీతో పొత్తు వల్ల విజయవాడ వెస్ట్‌లో తనకు 50 వేల ఓట్లు రాలేదని కేశినేని నాని అన్నారు. బీజేపీ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందన్నారు. లేకపోతే తనకు లక్షా 30 వేల మెజారిటీ రావాల్సిందని చెప్పారు.

నా మెజార్టీ తగ్గడానికి బీజేపీయే కారణం

నా మెజార్టీ తగ్గడానికి బీజేపీయే కారణం

తాను కేవలం 70 వేల ఓట్ల మెజారిటీతో గెలవడానికి కారణం బీజేపీయేనని కేశినేని నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను 3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమాగా చెప్పారు.

బుద్ధా, బోండా సహకారం

బుద్ధా, బోండా సహకారం

ఈ మేరకు బుద్ధా వెంకన్న, బొండా ఉమ, గద్దె రామ్మోహన్ సహకారం అందిస్తున్నారని నాని తెలిపారు. కాగా, ఈ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి.

జగన్ ఢిల్లీలో ప్రధానిని కలిసిన అనంతరం బిజెపి, టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్టేనని వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది.

English summary
Telugudesam Party leader and MP Kesineni Nani make hot comments on BJP on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X