హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'జగన్‌కు 5 నిమిషాలు, అధికార పక్ష నేతలకు మాత్రం 27 నిమిషాలా?'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సభలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైక్ కట్ అవతుంది గానీ మంత్రులు, ఇతర అధికార పక్ష నేతలకు మాత్రం 27 నిమిషాల అవకాశం ఎలా వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు శాసనసభ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే 15 నిమిషాల పాటు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. స్పీకర్ దర్శకత్వంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

సభను టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు సినిమా పిచ్చికి ఈ ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల్లో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజార్చిన ఓటుకు నోటు కేసు కూడా ఉందన్నారు.

kotamreddy sridhar reddy fires opposition leaders mike for every 5 seconds

మరిన్ని ముఖ్యాంశాలు:

* జగన్ మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైకు కట్ అవుతుంది. అధికార పక్షానికి మాత్రం 27 నిమిషాలు అవకాశం ఇస్తారు.
* ప్రత్యేక హోదా సాధన కోసం చిత్తశుద్ధితో ముందుకు రావాలి అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి కాలపరిమితితో కూడిన తేదీని నిర్ణయించాలని కోరుతున్నాం
* రెచ్చగొట్టే మాటలతో సభను నిలిపివేయడం కాకుండా సభను సజావుగా నడవనివ్వాలని కోరుతున్నాను
* రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
* అసెంబ్లీలో తీర్మానం పెట్టాలంటే ఇన్నాళ్లూ ఉలుకూ పలుకు లేని చంద్రబాబు అనేక మంది ఆత్మహత్యలకు కారణమయ్యారు.
* నిన్న సీఎం 10 పేజీల స్టేట్ మెంట్ చదివారు. అయితే, స్టేట్ మెంట్ లో అంటే ఆ నోట్ లో ఉన్న విషయాలు మాత్రమే చదవాలి, చదవాలి, దానిపై చర్చలో ఏమైనా చెప్పచ్చు.
* కానీ దుర్మార్గంగా స్టేట్ మెంట్ ఒక పేజీ చదువుతూనే అందులో లేని అంశాలను చెబుతూ జగన్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడారు
* చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై వెంటనే ప్రకటన చేయాలి.
* సమస్యలున్నాయి గానీ, అవన్నీ ప్రత్యేక హోదా తర్వాతే అసలు ఆ అంశమంటే ప్రభుత్వానికి భయమెందుకో నాకు అర్థం కావట్లేదు.
* ఢిల్లీలో ఒకమాట, హైదరాబాద్‌లో ఒకమాట చెబుతున్నారు బీజేపీ మంత్రులు కూడా అప్పుడో మాట, ఇప్పుడోమాట అంటున్నారు.

English summary
kotamreddy sridhar reddy fires opposition leaders mike for every 5 seconds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X