కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపు

కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి తన సమీప వైసిపి అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డిపై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి తన సమీప వైసిపి అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డిపై 64 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఇటీవలే మరణించిన టిడిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రయత్నించారు.

kurnool tdp candidate silpa chakrapani reddy won in local body elections

కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1084 ఓట్లున్నాయి.అయితే ఈ ఎన్నికల్లో కేవలం 1077 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి భారీ మెజారిటీ వస్తోందని భావించినప్పటికీ ఆశించిన మెజారిటీ రాలేదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి 565 ఓట్లు రాగా, వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డికి 501 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లలేదు. ఒక్క ఓటు నోటాకు పడింది.64 ఓట్ల మెజారిటితో శిల్పా చక్రపాణి రెడ్డి విజయం సాధించారు. మరో వైపు టిడిపి తన బలం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి వైిసిపికి ఓట్లు పడ్డాయని ఆ పార్టీ నాయకులు గుర్తించారు. ఈ విషయమై పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తామని శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు.

English summary
kurnool tdp candidate silpa chakrapani reddy won in local body elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X