ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరితో నర్సు అక్రమ సంబంధం: ముఠా కట్టి డాక్టర్ ఇల్లు దోచింది

ముఠా ఏర్పాటు చేసి తన ప్రియుడి ఇల్లు దోచిన నర్సును పోలీసులు అరెస్టు చేశారు.ఓ వైద్యుడి వద్ద నర్సుగా చేరిన మహిళ అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏలూరు: ముఠా ఏర్పాటు చేసి తన ప్రియుడి ఇల్లు దోచిన నర్సును పోలీసులు అరెస్టు చేశారు.ఓ వైద్యుడి వద్ద నర్సుగా చేరిన మహిళ అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత గొడవలు జరగడంతో అతడిపై పోలీసు కేసు పెట్టింది.

మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఒక ముఠా ఏర్పాటు చేసి వైద్యుని ఇల్లు కొల్లగొట్టింది. పోలీసులు దర్యాప్తు చేసి ఆ మహిళతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు.

వారి నుంచి 36 కాసుల బంగారు ఆభరణాలు, కేజీ 400 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలూరు టూటౌన్ డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు కేసు వివరాలను చెప్పారు.

ఇలా విడిపోయింది...

ఇలా విడిపోయింది...

ఏలూరు రామచంద్రరావుపేటలో డాక్టర్‌ బచ్చోటి శివరామారావు ఆస్పత్రి నడుపుతున్నాడు. ఆయన వద్ద గతంలో నర్సుగా చేరిన దుర్గాభవాని ఆయనతో వివాహేత సంబంధం పెట్టుకుంది. ఆయన తనను పెళ్ళి చేసుకున్నారని వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది. ప్రస్తుతం ఆమె ఏలూరులోని ఆర్‌ఎంఎస్‌ కాలనీలో ఒక అపార్టుమెంట్‌‌లో నివాసం ఉంటోంది.

ఆ తర్వాత

ఆ తర్వాత

ఆ తర్వాత పినకడిమికి చెందిన తూరపాటి పెదబాబు(24)తో దుర్గాభవాని వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. దుర్గాభవాని డాక్టర్‌ వద్ద ఉన్న కాలంలో లాకర్ల తాళాలన్నీ మారు తాళాలు చేయించుకుంది. ఆమె పురిగొల్పడంతో ఫిబ్రవరి 13న రాత్రి తూరపాటి పెదబాబు, అతని స్నేహితులైన ఏలూరులోని ఇజ్రాయిల్‌పేటకు చెందిన విప్పల శివకుమార్‌ అలియాస్‌ శివ, పవరుపేటకు చెందిన గొర్రెల సతీష్‌, గన్‌బజార్‌కు చెందిన మేతర ప్రకాష్‌ అలియాస్‌ ప్రభు కలిసి డాక్టర్‌ శివరామారావు ఇంట్లో దొంగతనం చేశారు.

కేసు నమోదు చేసి...

కేసు నమోదు చేసి...

చోరీ సంఘటనపై టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐ జి.మధుబాబు కేసు దర్యాప్తు చేశారు. ఎస్‌ఐ ఎస్‌‌ఎస్‌ఆర్‌.గంగాధర్‌, ఏఎస్‌ఐ నాగేశ్వరరావు, కానిస్టేబుళ్ళు సత్యనారాయణ, మహేష్‌, సీతాదేవయ్య, స్వామి, బాజీ కలిసి నిందితులను అరెస్టు చేశారు.

సొత్తు స్వాధీనం...

సొత్తు స్వాధీనం...

నిందితుల నుంచి ఎనిమిది లక్షలు విలువైన 36 కాసుల బంగారు ఆభరణాలు, కేజీ 400 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
A nurse forming a gang resorted to theft in a doctor's house at Eluru in West Godavari district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X